ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా సమ్మక్క సారలక్క జాతర జరుగుతుంది. ఈ జాతర రెండేళ్లకు ఒకసారి జరగడంతో భక్తులు సైతం లక్షల్లో వస్తూ ఉంటారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. అలాంటి మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్ టీనా శ్రావ్య చేసిన పని వల్ల విమర్శల పాలయ్యింది. ఈ జాతరలో నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడం ఎన్నో ఏళ్ల ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీనా తన వనదేవతలకు ఈ బెల్లాన్ని సమర్పించింది.


అయితే ఇదంతా బాగా ఉన్న తన పెంపుడు కుక్కను కూడా తక్కెడలో కూర్చోబెట్టి మరి సమ్మక్క సారలమ్మకు బెల్లాన్ని చెల్లించడం తీవ్రమైన వివాదాస్పదంగా మారింది. ఈ వీడియో తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారడంతో చాలామంది ఇమెను విమర్శించారు. దీంతో ఈ విషయంపై తన తప్పు తెలుసుకున్న  హీరోయిన్ టీనా శ్రావ్య తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని విడుదల చేస్తూ తెలియజేసింది. మేడారం జాతరలో జరిగిన విషయం పైన అందరికీ క్లారిటీ ఇవ్వడంతో పాటు  క్షమాపణలు చెబుతూ వీడియోని చేసింది.


ఆ వీడియోలో మాట్లాడుతూ.. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాతే తెలిసింది. తాను చేసిన పని కరెక్ట్ కాదని, తను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు, ఇటీవల ఆ కుక్కకు ట్యూమర్ సర్జరీ అయ్యింది అది మంచిగా కోలుకోవాలని సమ్మక్క సారలక్కకు మొక్కుకున్నానని, అలా అనుకున్నట్టుగానే కుక్క కోలుకొని బాగా ఉండడంతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను.. ఎవరిని కించపరిచాలని ఉద్దేశం తనకి లేదని, అయితే మన మేడారం జాతర సంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచారం ప్రకారం ఇది తప్పని తెలుసుకున్నాను, తాను చేసిన పొరపాటు వల్ల  ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే క్షమించండి ఇకమీదట ఇలా జరగదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: