తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. అదేమిటంటే ఇందులో చిరంజీవికి భార్యగా హీరోయిన్ ప్రియమణి నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి కూతురు పాత్రలో హీరోయిన్ కృతి శెట్టి కూడా నటించబోతున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటన అయితే చేయలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఈ చిత్రంలో కూడా చిరంజీవితో పాటు మరొక హీరో గెస్ట్ పాత్రలో హీరో కార్తీ నటించబోతున్నట్లు సమాచారం.
తెలుగు, తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కార్తీ ఈ చిత్రంలో నటించడానికి డేట్లను సర్దుబాటు చేస్తున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి కార్తీ భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా 158 చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. అలాగే చిరంజీవి ,డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర సినిమా ఎప్పుడో మొదలుపెట్టిన విఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా ఆలస్యం అవుతోంది. ఈ ఏడాది ఈ సినిమాను విడుదల చేస్తారో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి