ఫిబ్రవరి 21 నుండి మార్చి 1వ తేదీ వరకు 8 సూపర్ మ్యాచులు జరగనున్నాయి. మార్చి 4వ తేదీన ఫస్ట్ సెమి ఫైనల్, మార్చి 5వ తేదీన సెకండ్ సెమి ఫైనల్ జరగనుంది. గ్రూప్ స్టేజిలో ఇండియా ఫిబ్రవరి 7వ తేదీన USA తో మొదటి పోరుకు సిద్ధమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న భారత్ నమిబియాతో,ఫిబ్రవరి 15న కొలంబోలో టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అనంతరం ఫిబ్రవరి 18న ఇండియా నెదర్లాండ్ తలబడనున్నాయి.
ఇండియన్ జట్టు విషయానికి వస్తే:
సూర్య కుమార్ యాదవ్ ( కెప్టెన్), అక్షర పటేల్ (వైస్ కెప్టెన్), తిలక్ వర్మ, హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హర్షత్ రాణా, బూమ్రా ఉండనున్నారు. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత ఇషాన్ కిషన్ ని T20లో చోటు దక్కించుకోవడం గమనార్హం.
ఇక ఇదే జట్టు జనవరి 21వ తేదీన స్వదేశంలో న్యూజిలాండ్ తో జరగబోయే 5 t20 సిరీస్లలో కూడా ఆడనున్నట్లు బీసీసీఐ తెలియజేసింది.
తొలి టి20 మ్యాచ్ - జనవరి 21,
రెండో టీ 20 మ్యాచ్ - జనవరి 23
మూడో టి20 మ్యాచ్ -జనవరి 25
నాలుగో టీ20 మ్యాచ్ -జనవరి 28
ఐదో టి20 మ్యాచ్ - జనవరి 31
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి