హైదరాబాద్: సామాజిక న్యాయం కోసం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణపై తేల్చడమే కాకుండా, ప్రధానమంత్రికి కూడా లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ వర్గకరణను తేల్చిన చంద్రబాబు మరి తెలంగాణపై మాటేమిటనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ వర్గీకరణపై ఆఘామేగాల మీద నిర్ణయం తీసుకున్న చంద్రబాబు తెలంగాణపై తాత్సారం చేయడాన్ని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ మాలమహానాడు నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ డీపీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందనీ ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణపై అంత ప్రేమ ఎందుకు లేదో అర్థం కావడం లేదు. సేమ్ టైంలో నాలుగున్నర కోట్ల ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలనీ కోరుకుంటున్నారు, అనేక సందర్భాల్లోనూ తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదంటూ చెబుతూ వస్తున్నాడు.
తెలంగాణపై తమకు స్పష్టత వుందంటున్న చంద్రబాబు ముందు తెలంగాణపై మరింత క్లార్టీ ఇవ్వాల్సిందిగా తెలంగాణవాదుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. తెలంగాణను తేల్చకుండా చంద్రబాబు మాలమాదిగలు చీలపోయి, కొట్లాడుకునే విధంగా కుట్రలు చేస్తున్నారనీ తెలంగాణకు చెందిన మాదిగ నాయకులు అంటున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగ సవరణ జరగాలి అని డిమాండు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్న చంద్రబాబుకు గత ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణపై మరోమారు కేంద్రానికి లేఖ ఇస్తామనీ చెప్పిన విషయం గుర్తుకు లేదా? అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి టీడీపీ పొలిట్ బ్యూరో సుదీర్ఘ చర్చ చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరగల్సిందేననీ చంద్రబాబు అంటున్నారు.
ప్రస్తుత రిజర్వేషన్ల వల్ల అన్ని వర్గాలకూ న్యాయం సమంగా జరగడంలేదంటూ ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని సామాజిక వర్గాలకూ న్యాయం జరగాలన్నదే టీడీపీ ఉద్దేశమనీ బాబు చెప్పారు. అయితే, బాబు నిర్ణయంపై అప్పుడే అసంత్రుప్తులు వ్యక్తమవుతున్నాయి. ఒక పథకం ప్రకారమే బాబు మాలమాదిగల మధ్యన చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి. అదే విధంగా ఇటీవల కొత్తగా ఏర్పడిన వైఎస్ఆర్ పార్టీలోకి ఈ సామాజిక వర్గానికి చెందిన వారందరూ వెళ్లిపోతున్నారు. దీనికి బ్రేకులు వేసేందుకు ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఉన్న ఫలంగా నిర్ణయం తసుకున్నట్లు తెలుస్తోంది. మాలల ఓట్లు పోయినా, తమకు మాదిగల ఓట్లు దక్కుతాయనే రాజకీయ కోణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఎస్సీ వర్గీకరణతో మాదిగలు తనకు దగ్గరవుతారనీ బాబు ఆలోచనగా తెలుస్తోంది.
ఎస్సీవర్గీకరణ విషయంలో చూపించినంత శ్రద్దను తెలంగాణ విషయంలో కూడా చూపెట్టాలనే డిమాండు పెరుగుతోంది. అయితే, దీనిపై వచ్చే నెలలో పార్టీ సమావేశమై తగు నిర్ణయం తీసుకుంటాననీ బాబు తెలంగాణ తమ్ముళ్లకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాడా? లేక సీమాంధ్ర నేతలకు తలొగ్గి రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తాడా? అనేది పార్టీలో హాట్ హాట్ టాఫిక్ గా మారింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీసుకున్నంతగా ఈజీగా తెలంగాణ అంశంలో తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. ఏది ఏమైనా తెలంగాణ విషయంలో బాబు కాస్త ఆచితూచి అడుగులు వేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలం‘గానం’ బాబుకు అగ్ని పరీక్ష అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
మరింత సమాచారం తెలుసుకోండి: