గ్లోబల్ టైమ్స్ చైనా అధికార మీడియా అని భారత్ లోనే కాదు ప్రపంచం మొత్తానికి తెలుసు. గ్లోబల్ టైమ్స్ గొంతులోని స్వర పేటిక పీపుల్స్ పార్టి ఆఫ్ చైనా  దని చైనా స్వరమే గ్లోబల్ టైమ్స్ గొంతని జగమెరిగిన సత్యం. భారత్, జపాన్ కలసి సంయుక్తం గా చేపడుతున్న "ఆసియా-ఆఫ్రికా గ్రోత్ కారిడార్" (ఏ.ఏ.జి.సి) ప్రాముఖ్యాన్ని తగ్గించటానికన్నట్లు ఇది కూడా చైనా చేపట్టిన "వన్ బెల్ట్ వన్ రోడ్" (ఓ.బి.ఓ.అర్) లాంటిదేనని చెపుతూ దాని ప్రాముఖ్యాన్ని తగ్గిస్తూ "గ్లోబల్ టైమ్స్" రాసు కొచ్చింది.

china the poisonous dragon కోసం చిత్ర ఫలితం

జపాన్ ప్రధాని షింబో అబే అటు అమెరికాతో ఇటు భారత్ తో స్నేహం చేస్తున్నారు. ఆ రెండు దేశాలూ సమ్యుక్తంగా భారత్‌ను తప్పు దోవ పట్టిస్తున్నాయని సెంటర్ ఫర్ ఇండియన్ స్టడీస్ డైరెక్టర్‌గా చైనా వెస్ట్ నార్మల్ యూనివర్సిటీలో  పని చేసే "లాంగ్ గ్జింగ్‌ చున్" గ్లోబల్ టైమ్స్‌లో ఒక వ్యాసం రాశారు. మేలో జరిగిన "వన్ బెల్ట్ వన్ రోడ్ ఫోరం" లో అమెరికా, జపాన్ దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. దాన్ని బాయ్‌కాట్ భారత్ చేసిందని 'గ్జింగ్‌ చున్' పేర్కొన్నారు.  

indo japan relations కోసం చిత్ర ఫలితం

క్రమంగా భారత్, జపాన్ దేశాల మధ్య వాటి పాత స్నేహమే మరింతగా బలపడుతుండటం, అంతర్జాతీయ అవసరాల్లో ఇరువురి దారి ఒకటే కావటం, చైనా ఇరుదేశాలకు ప్రధాన సమస్య కావటం ఈ రెండు దేశాలను మరింత దగ్గర చేసింది. తను పాకిస్తాన్ తో చేసిన స్నేహం లాంటిదే భారత్ జపాన్ మైత్రి అని గుర్తించకుండా డ్రాగన్ ఓర్వలేకపోతోంది.

 indo japan relations కోసం చిత్ర ఫలితం

ఇండియాను జపాన్ తప్పుదోవ పట్టిస్తూ తమ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించేలా చేస్తోందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక విమర్శించింది. డోక్లాం వివాదం కారణంగా భారత్, చైనా మధ్య దూరం పెరిగిన నేపథ్యంలో జపాన్ ప్రధాని షింబో అబే ఇండియాలో పర్యటించడం దానికి అనేక అనుమానాలు వికసించటానికి ఆస్కారమిస్తున్నాయని తెలిపింది. గతవారం భారత్‌లో పర్యటించిన షింబో అబే "అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌" కు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే.

 indo japan relations కోసం చిత్ర ఫలితం

చైనాను నేరుగా ఎదుర్కోవడం జపాన్‌కు సాధ్యం కాదు కనుక ఆ దేశం భారత్‌ను ఒక ఆయుధంలా వాడుకుంటోందని "గ్లోబల్ టైమ్స్" తన విద్వేష పూరిత అసూయా జనిత వ్యఖ్యలతో విషం చిమ్మింది.

 

అంతే కాదు భారత్ తమ దేశంలో ఎక్స్‌ప్రెస్‌-వేలు, బుల్లెట్ రైళ్ల ను ప్రారంభించటానికి తగిన ఏర్పాటు చేస్తున్నా, భారత్ లోని చాలా వరకు రహదార్లు వాటికి తగినట్లు సరిగా లేవని వ్యంగ్య వ్యాఖ్యలతో విషం కక్కింది. భారత్, జపాన్ దేశాల చర్చల్లో ప్రధాన అజెండా చైనా నే అని అంటూ ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం భారత్, జపాన్‌లు చైనాతో కలిసి పని చేయాలని సూచించింది.

china jelous of indo japan relations కోసం చిత్ర ఫలితం

 ఒక మీడియా రాతలు ఈ దేశాల మైత్రిని చెడగొట్టలేవని దాని రాతల నేపధ్యంలో ఉన్న చైనా పీపుల్స్ పార్టిలోనే భారత్ పట్ల ఉన్న దృక్పధంలోనే ప్రామాణికమైన మార్పు రావాలని భారత్ భావిస్తుంది. సగటు చైనీయుడు, సగటు భారతీయుడు మధ్య ఎలాంటి భేద భావాలు లేవని అంతర్జాతీయంగా వీరు అనేక సంస్థల్లో స్నేహంగా కలిసి పనిచేస్తారని భారత్ భావిస్తుంది.

china jelous of indo japan relations కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: