•రాప్తాడులో రెడ్డీలు ఏ వైపు..
•కంచుకోటలో సునీతకు కలిసి వస్తుందా..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో  ఉన్నటువంటి నియోజకవర్గాల్లో రాప్తాడు నియోజకవర్గం చాలా ప్రత్యేకత కలిగి ఉంది. టిడిపికి కంచుకోటలా మారిన ఆ స్థానాన్ని 2019లో  వైసిపి కైవసం చేసుకుంది.  అలాంటి ఆ నియోజకవర్గంలో ఈసారి రసవత్తరమైన పోరు జరగబోతోంది. మరి ఈ పోరులో పై చేయి సాధించేది ఎవరు.. ప్రజలు ఏ వైపు ఉన్నారు అనే వివరాలు చూద్దాం.ఈ నియోజకవర్గంలో దశాబ్ద కాలానికి పైగా పరిటాల, తోపుదుర్తి కుటుంబం మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత రాజకీయ వైరం ఉంది. 2019 కి ముందు వరుస విజయాలు సాధించినటు వంటి పరిటాల ఫ్యామిలీకి  2019లో చేదు అనుభవం ఎదురయింది. అలాంటి ఆ నియోజకవర్గంలో  ఈసారి పరిటాల సునీత, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య  విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ పోటీలో ఎవరికి ఎంత బలం ఉంది గెలుపోవటం అనేది ప్రభావితం చేసే అంశాలు ఏంటి అనే వివరాలు చూద్దాం.

 ప్రకాష్ రెడ్డి వర్సెస్ సునీత:
 వైసీపీ నుంచి పోటీ చేస్తున్నటు వంటి తోపుదుర్తి ప్రకాష్  రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతను సిట్టింగ్ ఎమ్మెల్యే. 2009లో మొదటిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతే కాకుండా 2014లో వైసిపి నుంచి పోటీ చేసి మరోసారి ఓడిపోయారు. ఇక 2019లో మూడోసారి పోటీ చేసి గెలిచారు. మొదటిసారి ఓటమి ఎరగనటువంటి పరిటాల ఫ్యామిలీని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక టిడిపి కూటమి నుంచి పోటీ చేస్తున్నారు పరిటాల సునీత. వీరి కుటుంబం మొదటి నుంచి టిడిపి పార్టీలో కొనసాగుతూ వస్తోంది. ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు. ఇక 2009, 2014లో వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువగా రెడ్డి, బోయ, కురుబ ఓట్లు ఉంటాయి.

 గెలుపోటములు:
ఈ నియోజకవర్గంలో ఇద్దరు కీలకమైన లీడర్లే. ఇద్దరు నాయకులు ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు.దీంతో ఎవరు గెలుస్తారనేది ఇప్పటికి చెప్పడం కష్టంగానే మారింది. అయితే ఒక్కసారి గెలిచినటువంటి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల గురించి చెబుతూ ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా జగన్ ఇమేజ్ ఈయనకు చాలా కలిసి వచ్చింది.  కలిసి రాని అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ చేస్తున్నా కానీ గత ఎన్నికల్లో రెడ్డిలకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో వారు ఈసారి మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.  రెడ్డి ఓట్లు ఎక్కువగా పరిటాల సునీతకు పడతాయని అంటున్నారు. అయితే సునీత  గతంలో నేను ఉన్నప్పుడే చేసిన రోడ్లు, ఇండ్లు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పుకుంటూ ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా ఈసారి గెలిస్తే నాకు మంత్రి పదవి కూడా వస్తుంది అనే  ప్రలోభాన్ని తీసుకువచ్చింది. ఈ విధంగా పరిటాల సునీత  ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తూ గెలుపు తీరాల వైపు వెళుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉన్నది. ఎవరు గెలుస్తారో చెప్పడం కూడా కష్టంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: