హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవీ రాజీనామా పంచాయితీ నేటితో తేలిపోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. ధర్మాన విషయంపై ఇప్పటికే పీసీసీ చీఫ్ బొత్స ఢిల్లీలో ఉన్నారు. సీఎం కిరణ్ కూడా ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులు గులాంనబీ ఆజాద్, రవి, ఆహ్మద్ పటేల్ తో సమావేశమైన తరువాత పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో కూడా సమావేశం కావచ్చని తెలుస్తోంది. రాష్ర్టంలో నెలకున్న పార్టీ పరిస్థితుల గురించి సీఎం ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం వుంది.
ఇదిలా ఉంటే, ధర్మాన రాజీనామా లేఖ సీఎం వద్ద పెండింగ్ లో వుంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనీ రాష్ర్ట కాంగ్రెస్ నాయకులు చేసిన విన్నపాలన్నింటిని కాంగ్రెస్ పెద్దలు తిరస్కరించారు. ధర్మాన రాజీనామాపై తుది నిర్ణయం తీసుకునే అధికారం సీఎందేననీ ఇప్పటికే పార్టీ రాష్ర్ట వ్యవహారాల పరిశీలకుడు వాయిలార్ రవి తేల్చారు. కాంగ్రెస్ అధిష్టానం సీబీఐ వైపే మొగ్గు చూపుతున్నట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మంత్రులను వెనకేసుకువస్తే జగన్ కేసు నిర్వీర్యం అవుతుందనీ, దీనితో పలువురు మంత్రులు కేసుల్లో ఇరుక్కున్న ఫర్వాలేదు అనే అభిప్రాయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
ధర్మాన రాజీనామాను అమోదింపచేయడంతో పాటు కళంకిత మంత్రులను తొలగించడానికి కూడా కాంగ్రెస్ వెనకాడటంలేదనీ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ వైపు కేబినెట్‌ను ప్రక్షాళన చేసేందుకు సీఎంకు అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతుండగా...మరోవైపు ఏకంగా సీఎం కిరణ్‌ను మార్చవచ్చనే ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి రాష్ర్ట కాంగ్రెస్ పార్టీలో, సర్కార్ లో నెలకున్న ప్రతిష్టంభనకు రేపో,మాపో తెరపడే సూచనలు అగుపిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: