చంద్రబాబు వయసు డెబ్బయ్యేళ్ళు. రాజకీయ అనుభవం నలభయ్యేళ్ళు. ఈ రెండు చెప్పి ఇపుడు కొత్త రాజకీయం మొదలెట్టేశారు. నన్ను చూడు నా వయసును చూడు అంటూ సింపతీ సాంగేసుకుంటున్నారు. అనుభవం అనుభవం అంటూ ఆవులిస్తున్నారు. బాగానే ఉంది, అధికారంలో ఉన్నపుడు ఏమైందో ఇదంతా అంటే మాత్రం అరచి గోల పెడతారంతే.


హామీలు ఇస్తే అమలు చేయాల్సిందేనట. ఈ మాట మన చంద్రబాబు గారి నోటి వెంట రావడమే అసలైన విడ్డూరం, దాదాపు వంద పేజీల హామీలతో ఆరు వందలకు పైగా చేర్చి గత ఎన్నికల్లో జనాల నుంచి ఓట్లు తెచ్చిన చంద్రబాబు అయిదేళ్లలో వాటిలో వేటినీ  సాఫీగా  అమలు ఏసినా పాపాన పోలేదు. మరి అటువంటి బాబుగారు ఇపుడు తన అనుభవాన్నంతా రంగరించి జగన్ కి నీతి బోధలు చేస్తున్నారు.


హామీలు  ఇస్తే తప్పకుండా అమలు చేయాల్సిదేనట.చిత్తశుద్ధి, అంకితభావం లాంటి భారీ మాటలే వాడుతున్నారు. జగన్ నోటికొచ్చిన  హామీలతో చిటికల పందిరి వేశారుట. అమ్మ ఒడికి అన్ని ఆంక్షలా, అమరావతికి నిధులేవీ,  కడప స్టీల్ ప్లాంట్ కి 250 కోట్లు సరిపోతాయా. ఇదీ చంద్రబాబు గారి గగ్గోలు. ఇంతకీ ట్విస్టేంటంటే తాను ఇచ్చిన అన్ని హామీలు జగన్ బడ్జెట్లో పెట్టి మరీ భారీ కేటాయింపులు జరిపారు. దాన్ని తట్టుకోలేక బాబు అండ్ కో వక్ర భాష్యానికి సిధ్ధపడిపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: