హైదరాబాద్: జగన్ పై కాంగ్రెస్, టీడీపీ కక్షసాధింపు, సీబీఐ వేధింపులను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు గురువారం నాడు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నిరసనకు దిగారు. వీరికి మద్దతుగా వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు.
అసెంబ్లీలోని గాంధీ విగ్రహం దగ్గర కేవలం నివాళులర్పించే అవకాశం మాత్రమే వుందనీ, నిరసన తెలిపేందుకు అనుమతి లేదనీ పోలీసులు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను,మాజీ ఎమ్మెల్సీలను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్లితే...తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. నూతనంగా ఎంపికైన వారందరూ సమావేశమై వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా విజయమ్మను ఎన్నుకున్నారు.
లోటస్పాండ్లో సమావేశం ముగిసిన అనంతరం వారందరూ అసెంబ్లీ చేరుకున్నారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా అక్కడి గాంధీ విగ్రహం వద్ద ఒక రోజు నిరసన చేపట్టడానికి కూర్చున్నారు. అయితే ఇక్కడ నిరసన చేసేందుకు అనుమతి లేదనీ పోలీసులు, అసెంబ్లీ ఆవరణలో తమల్ని అరెస్టు చేసే అధికారం పోలీసులకు లేదనీ ఎమ్మెల్యేలు అనడంతో ఇరువురి మధ్యన కొంతసేపు వాగ్వాదం జరిగింది. చివరకు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. దీనితో వైఎస్ఆర్ ఎమ్మెల్యేల ఒక రోజు నిరసన దీక్ష మధ్యలో ఆగిపోయింది.
మరింత సమాచారం తెలుసుకోండి: