హైదరాబాద్: శుక్రవారం నాడు రాష్ర్ట వ్యాప్తంగా పాఠశాలల బంద్ కొనసాగుతోంది. ప్రయివేట్ పాఠశాలలో పెంచిన ఫీజులను నిరసిస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) ఇచ్చిన పాఠశాలల బంద్లో భాగంగా బంద్ కొనసాగుతోంది. ప్రయివేట్ పాఠశాలల యజమాన్యం తమకు తోచిని విధంగా ఫీజులను పెంచడాన్ని ఏబీవీపీ తప్ప బడుతోంది. ప్రయివేట్ పాఠశాలల యజమాన్యం ఏటేటా ఫీజులను పెంచుతోంది. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చెప్పుకోదగ్గ చర్యలు తీసుకోవడం లేదు. ఫీజుల పెంపుపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ప్రయివేట్ యజమాన్యం ఇష్టానుసారంగా పెంచుకుంటోంది. పల్లె ప్రాంతాలలోని ప్రయివేట్ పాఠశాలలు ఒకటి తరగతి పిల్లాడికి 10వేల రూపాయల వరకు ఫీజులను వసూలు చేస్తోంది. ఈ ఫీజులు తల్లిదండ్రులకు పెనుభారంగా మారాయి. ఫీజుల పెంపును నిరసిస్తూ ఏబీవీపీ ఇచ్చిన బంద్ను పురస్కరించుకుని ముందుగానే ప్రయివేట్ పాఠశాలల యజమాన్యం సెలవు ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: