రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సమీకరణ కు చట్టబద్దత తెస్తామని మంత్రి రావెళ్ల కిషోర్ బాబు చెప్పారు. మంత్రివర్గ ఉప సంఘం సమావేశం తర్వాత మంత్రులు కిషోర్,నారాయణ మీడియాతో మాట్లాడారు.రాజధాని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కిషోర్ చెప్పారు.రైతులకు న్యాయం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. కాగా మంత్రి నారాయణ మాట్లాడుతూ భూ సమీకరణపై చట్టబద్దత కల్పించడానికి శాసనసభలో బిల్లు పెట్టడమా,లేక ఆర్డినెన్స్ తీసుకు రావడమా అన్నది ఆలోచిస్తున్నామని అన్నారు. సింగపూర్ దేశం మనకు పూర్తిగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిందని అన్నారు.  రాజధాని చుట్టూ మూడు రింగులు ఏర్పాటుచేస్తారని డెబ్బై ఐదు కిలోమీటర్ల పరిదిలో, తదుపరి 125 కిలోమీటర్ల పరిధి, ఆ తర్వాత 225 కిలోమీటర్ల పరిధిలో ఉంటుందని అన్నారు. నదికి ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలు రాజధానిలో కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని పూజ చేయాలన్న భావనతో ఉన్నామని ఆయన అన్నారు.ఆ ఏడు గ్రామాల వారు బూ సమీకరణకు వ్యతిరేకిస్తున్న నేపద్యంలో కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: