బర్మా ప్రజాస్వామ్య కుసుమం ఆంగ్ సాన్ సూకీ తన భారత దేశ పర్యటనలో భాగంగా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మారుమూల గ్రామంలో మహిళలు స్వయం సహాయక బృందాల ద్వారా ఎలా ఆర్ధిక,సామాజిక సాధికారత సాధించారో ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కానీ మన రాష్ట్రం ఎన్నో సమస్యలను ఎదుర్కున్టున్న వేళ, ఈ గ్రామం మన రాష్ట్రాభివృద్ధికి దర్పణం పడుతునట్టు ఎందుకు చూపించారో కొందరికి అర్థం కావట్లేదు. విద్యుత్ లేక, అధిక పెట్టుబడి భరించలేక రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇదొక్కటే ఎందుకు చూపించారని, మిగతా ప్రాంతాలలో పాలన ఎలా పడకేసిందో కూడా సూకీ గారికి చూపించాల్సిందని సామాజికవేత్తలు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: