
దీని వివరణ ఏమిటంటే.. ముఖ్యంగా మన లోపాలను మనం తెలుసుకోగలగాలి. అప్పుడే ఆ లోపాలను సరిదిద్దుకోని, ముందడుగు వేయగలం. ఇక అంతకన్నా పెద్ద చదువు ఏదీ లేదు. మనం ఎంత పెద్ద చదువులు చదివినప్పటికీ, మన లోపాలను మనం తెలుసుకో లేకపోతే అది అన్నిటికన్నా పెద్ద నేరం. ఆ చదువులన్నీ వృధా అయిపోతాయి. ముందుగా మనం ఏంటో,మనలో ఉన్న లోపాలు ఏంటో తెలుసుకోగలగాలి.. అప్పుడే అందరిలోనూ,మంచిగా మెలగడానికి ఒక మార్గం ఏర్పడుతుంది.. అని దీని అర్థం..
సాధారణంగా ఎదుటివారిలో లోపాలను చూపించేటప్పుడు, మనము చూపుడు వేలుతో ఆ వ్యక్తి చేసిన లోపాలను చూపిస్తూ ఉంటాము. కానీ మిగతా 4 వేళ్ళు మన వైపు చూస్తున్నాయి అన్న విషయాన్ని మనం గమనించము. అయితే ఎదుటి వాడిలో ఒక లోపం కనబడితే, మనలో నాలుగు లోపాలు ఉన్నాయి అని అర్థం. కాబట్టి ఎదుటి వారిని నిందించే ముందు మనం ఆ పని సవ్యంగా చేసామా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎప్పుడైతే అలా ఆలోచించగలిగే శక్తి మనలో కలుగుతుందో, ఎదుటివారిలో లోపాలను చూపించడానికి ముందుకెళ్లరు.
లోపం అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అది వారి బలహీనతలను బట్టి బయటపడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వారి లోపాలను గమనించినట్లయితే, ఎదుటి వారు మన గురించి మాట్లాడుకునే అవకాశం నుంచి మనం విముక్తి పొందవచ్చు..