ఒకసారి ఒకపెద్ద యుద్ధం జరిగింది.చిన్న సైన్యంతో అశోకుడు అనే రాజు,పెద్ద సైన్యం తో గణేశుడు అనే రాజు యుద్ధం చేశారు.ఎవరి శక్తి కలది వారు పోరాడారు.ఎత్తులకి పైఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని యిద్దరూ ప్రయత్నించారు.కాని పాపం చిన్న సైన్యంతో అశోకుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అశోకుడు బాగా అలసిపోయాడు.అతనికి నిలబడే శక్తి కూడా లేదు.వంటి నిండా గాయాలయ్యాయి.తాను నెగ్గడం కుదరదని అనుకోని ఆరాజు మెల్లగా అక్కడి నుండి పారిపోయి దగ్గరలోని ఒక గృహలో దాక్కుని ప్రాణాలను కాపాడుకున్నాడు.

అక్కడే ఉండి తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.అలా కాలం గడుస్తూ ఉండగా అతడు యుద్ధంలో ఓడిపోయానని బాధ చెందుతాడు.అప్పుడు అతనికి అక్కడ ఒక సాలెపురుగు కనిపిస్తుంది.అది క్రింద నుండి పైన ఉన్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది.కాని అది ఎన్ని సార్లు ప్రయత్నించినా క్రిందకు పడిపోతుంది.అయిన అది పట్టువదలక ప్రయత్నం చేస్తూనే ఉంటుంది.అలా 17వ సారికి తన గూటికి చేరుకుంది.

దాని పట్టుదల చూసిన రాజుకి జ్ఞానోదయం  అయ్యింది.అంత చిన్న సాలెపురుగు తన గమ్యాన్ని చేరుకోవడానికి అంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మనిషిగా ఇక నేను ఎంత ప్రయత్నం చేయాలి అని అనుకోని యుద్దానికి సాదన మొదలుపెట్టాడు.యుద్దంలో మిగిలిన సైన్యంతో ''ఈ సారి తప్పక శత్రువును ఓడించాలి' అని గట్టిగా నిశ్చయిoచుకున్నాడు.మళ్ళి ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయటం మొదలుపెట్టాడు.సైనికులకి తగిన శిక్షణ ఇచ్చుట చేతవాళ్ళు సులభంగా శత్రువును మట్టికరిపించారు.పెద్ద సైన్యం గల రాజు ఓడిపోయాడు.చిన్న సైన్యం గల రాజు గెలిచాడు.చిన్న రాజు ఐన అశోకుడు గెలిచాడు.అప్పుడు పెద్ద రాజు ఐన గణేశుడు తన రాజ్యంతో పాటు తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు.తన సైన్యం చిన్నదని బాధపడుతూ ఉంటే అశోకుడు విజయం సాదించే వాడు కాదు.తన పట్టుదలతో మళ్ళి యుద్ధం చేశాడు కాబట్టే విజయం సాదించాడు. మన నిజ జీవితం కూడా అంతే మనకు ఏది రాదు,మనము ఏమి చేయలేము అని బయపడితే అలాగే ఓటమిని చూస్తాము.అలాగే పట్టుదలతో శ్రమిస్తే విజయం మనది అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: