ఈ ఏడాది టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఎన్నో ఆశలతో టీమ్ ఇండియా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టిన టీమ్ ఇండియా జట్టు అటు వరుసగా ప్రాక్టీస్ మ్యాచ్లతో మునిగి తేలుతూ ఉంది. అయితే విరాట్ కోహ్లీ తర్వాత మూడు ఫార్మాట్లకు కూడా టీమిండియా కెప్టెన్సీ అందుకున్న రోహిత్ శర్మ సారథ్యంలో మొదటిసారి టీమ్ ఇండియా జట్టు వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి. కాగా గత కొంతకాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్ లో  టీమిండియా కు విజయాలు అందిస్తూ దూసుకుపోతున్నాడు రోహిత్ శర్మ.


 కానీ మొన్నటికి మొన్న జరిగిన ఆసియా కప్ లో మాత్రం రోహిత్ శర్మ టీమ్ ఇండియా అని సమర్థవంతంగా ముందుకు నడిపించలేక విఫలం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం అటు టి20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా తప్పక వరల్డ్ కప్ విజయం సాధిస్తుంది అని భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో బలమైన నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిస్తున్నారు.



 ఇక టీమిండియా ఆడబోయే ప్రతి మ్యాచ్ లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగాలి అనే విషయంపై కూడా పలు సూచనలు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమైన టి20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మ జట్టుకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక సూచనలు చేశాడు. ఏ జట్టును కూడా తేలికగా తీసుకోవద్దని ఎందుకంటే లైట్ తీసుకుంటే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇందుకు ఆసియా కప్ చక్కటి ఉదాహరణ అంటూ గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా ఆసియా కప్ లో కీలకమైన మ్యాచ్ లలో టీమిడియా ఓడిపోయి  ఇంటిదారి పట్టింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: