2022 ఏడాదిని అటు టీమ్ ఇండియా జట్టు అద్భుతమైన విజయంతో ఘనంగా ముగించింది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను 2-0  తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడంతో ఇక కేఎల్ రాహుల్ సారధ్యంలో బలిలోకి దిగిన టీమిండియా జట్టు అదరగొట్టింది అని చెప్పాలి.  ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భాగంగా ఎంతో మంది ఆటగాళ్లు కూడా రికార్డులు నమోదు చేశారు. కెరియర్ లోనే తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేయగా.. సీనియర్ ప్లేయర్ పూజార మళ్ళీ ఫామ్ లోకి వచ్చి అదరగొట్టాడు. ఇక శ్రేయస్ అయ్యర్ సైతం రెండు టెస్టుల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. కొంతకాలం కాల నుంచి వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్ తన విలువెంటో మరోసారి చాటి చెప్పాడు.


 రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన బ్యాట్ కు పని చెప్పి ఆశ్చర్యపరచగా.. ఇక కుల్దీప్ యాదవ్ అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చి  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా అందుకున్నాడు. అయితే ఇక అందరూ ఇలా 2022 ఏడాదిలో సరిపడా మెమోరీస్ ని సంపాదించారు. కానీ టీమ్ ఇండియాలో ఇటీవలే బ్యాకప్ వికెట్ కీపర్ గా ఎంపికైన తెలుగు ఆటగాడు కేఎస్ భరత్ మాత్రం రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యి  నిరాశలో మునిగిపోయాడు అని చెప్పాలి. రిషబ్ పంత్ వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా ఉండడంతో భరత్ కు అవకాశాలు రాలేదు. ఈ యంగ్ ప్లేయర్ జట్టుతో ఉన్న అరంగేట్రం మ్యాచ్ కోసం మాత్రం ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తూ ఉన్నాడు అని చెప్పాలి. బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్టుపై ఆడేందుకు తుదిజట్టులో అవకాశం లభిస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. కానీ రెండు మ్యాచ్ల్లో కూడా నిరాశ ఎదురయింది.


 అయితే దేశ వాలి క్రికెట్లో ఇతను అత్యుత్తమ గణాంకాలను  నమోదు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. 2013లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 83 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 4,500 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు 25 ఆర్ద సెంచరీలు ఉన్నాయి. ఇక లిస్టు ఏ క్రికెట్లో 64 మ్యాచ్ లు ఆడి 1950 పరుగులు చేశాడు  ఇందులో ఆరు సెంచరీలు 6  అర్థ సెంచరీలు ఉండడం గమనార్హం. కాగా ఇటీవల జరిగిన మినీ వేలంలో 1.2 కోట్లకు గుజరాత్ టైటాన్స్ అతన్ని కొనుగోలు చేసింది. మరి కొత్త ఏడాదిలో అయినా ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: