2023 ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్న శుభమన్ గిల్ తన ఆటతీరుతో విధ్వంసం సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి బౌలింగ్ చేయాలంటేనే బౌలర్లు భయపడిపోయే విధంగా ఏకంగా పరుగుల వరద పారిస్తున్నాడు శుభమన్ గిల్. ఇక ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల కీలకమైన నాకౌట్ మ్యాచ్లో కూడా జట్టును గెలిపించేందుకు సూపర్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు శుభమన్ గిల్. ఏకంగా 60 బంతుల్లో 129 పరుగులు చేసే తనకు టి20 ఫార్మాట్లో తిరుగులేదు అన్న విషయాన్ని మరోసారి నిరూపించాడు అని చెప్పాలి. ఇక శుభమస్తు సెంచరీ ద్వారా ఎన్నో రికార్డులను కూడా బ్రేక్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఒకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన యంగెస్ట్ ప్లేయర్గా రికార్డర్ సృష్టించాడు. అంతేకాదు 851 పరుగులతో ఈ ఐపిఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా కొనసాగుతూ వున్నాడు అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో గిల్ అత్యధిక పరుగులు చేసినప్పటికీ మొత్తంగా ఐపీఎల్ హిస్టరీలో చూసుకుంటే మాత్రం గిల్ కంటే ముందు 973పరులతో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. అయితే విరాట్ కోహ్లీ సాధించిన ఈ రికార్డు మాత్రం ఇప్పటివరకు చెక్కు చెదరలేదు అని చెప్పాలి. ఏ భారత ఆటగాడు కూడా కోహ్లీ చేసినన్ని పరుగులు ఇప్పటివరకు చేయలేకపోయాడు.  కానీ ఇప్పుడు శుభమన్ గిల్ ముందు ఒక అద్భుతమైన ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇక నేడు అటు చెన్నై సూపర్ కింగ్స్ తో జరగబోయే ఫైనల్ మ్యాచ్లో శుభమన్ గిల్ 123 పరుగులు చేశాడు అంటే ఇక విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులను బద్దలు కొట్టి ఐపీఎల్ లో ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మెన్ గా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంటాడు. ఏం జరగబోతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: