
అయితే.. వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న ఎన్నికల్లో ప్రచారాలకు అనుమతులు ఉంటాయా అన్నది ఇప్పుడు అనుమానాస్పదంగా కనిపిస్తోంది. గతంలో కరోనా ఫస్ట్ వేవ్ ముగిసిన తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఆ ఎన్నికల సందర్భంగా జరిగిన ర్యాలీలు.. కుంభమేళా వంటి
కార్యక్రమాలే కరోనా సెకండ్ వేవ్‌కు దారి తీశాయన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు ఒమిక్రాన్ విరుచుకుపడుతున్న సమయంలో ఎన్నికల ప్రచారాలకు అనుమతి ఉంటుందా.. అండదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
రాజకీయ పార్టీలు మాత్రం ఆ పరిస్థితి వస్తే డిజిటల్ ప్రచారాలకు సైతం తాము సిద్ధం అంటున్నాయి. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఒమిక్రాన్ ఉధృతి దృష్ట్యా వర్చువల్ ప్రచారాలకు తాను సిద్ధం అని బీజేపీ అంటోంది. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ శాససభ ఎన్నికల్లో తాము ర్యాలీలను వర్చువల్‌గానే నిర్వహించామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గుర్తు చేశారు.
ఎన్నికల ప్రచార ర్యాలీలపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తాము తప్పక పాటిస్తామని గజేంద్ర సింగ్ షెకావత్ అంటున్నారు. కరోనా మొదటి, రెండో వేవ్ సమయంలో ప్రపంచంలోని అనేక రాజకీయ పార్టీలు నిద్రాణ స్ధితిలోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. బీజేపీ మాత్రం ప్పటికీ వర్చువల్ మాధ్యమం ద్వారా బూత్ స్ధాయి వరకు చురుకుగా పని చేస్తోందంటున్నారు గజేంద్ర సింగ్ షెకావత్. మరి బీజేపీయే ఓకే అంటే మిగిలిన పార్టీలు కూడా డిజిటల్ ప్రచారాలకు సిద్ధం కావాల్సిందే మరి.