అక్కినేని నాగేశ్వరరావు.. భారతీయ ప్రముఖ సినీ నటుడిగా , ఒక నిర్మాతగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. తన 75 ఏళ్ల జీవితంలో ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ ఎప్పటికీ నిలిచిపోయే ఏకైక నటుడు అని చెప్పవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు సినీ చిత్ర పరిశ్రమకు రెండు మూల స్తంభాలలో 1 నందమూరి తారకరామారావు అయితే మరొకటి అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. తెలుగు సినీ ఇండస్ట్రీ ని భారతదేశ ప్రేక్షకులకు పరిచయం చేసింది వీరిద్దరే. తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా దేశ వ్యాప్తంగా వ్యాపించారు.

అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన చిత్రాలకు గాను 7 రాష్ట్ర నంది అవార్డులు ,5 ఫిలిం ఫేర్ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులను అందుకున్నాడు. అంతే కాదు ఈయన చిత్రసీమకు చేసిన సేవకు , కృషికి భారతదేశ ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయినటువంటి పద్మ విభూషణ్ తో సత్కరించింది. ఇక సినిమారంగంలో ప్రముఖంగా చెప్పుకోదగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అక్కినేని నాగేశ్వరరావు పొందడం విశేషం.

అక్కినేని నాగేశ్వరావు 1923 సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీన ఒక పేద కుటుంబంలో జన్మించారు. వీరి సొంత ఊరు కృష్ణా జిల్లా రామాపురం. తల్లి అక్కినేని పున్నమ్మ, తండ్రి అక్కినేని వెంకటరత్నం. వీరిది పేద కుటుంబం కావడంచేత ఆర్థికంగా చదువుకోలేని పరిస్థితి ఏర్పడడంతో సినీరంగంలోకి తన పది సంవత్సరాల వయసులోనే అడుగుపెట్టాడు. ఎన్నో నాటకాలలో నటించి, ఆ తర్వాత నటుడిగా మారాడు. ఇక ప్రముఖ నిర్మాత ఘంటసాల బలరామయ్య సహాయంతో అక్కినేని నాగేశ్వరరావు సీతారామ జననం అనే చిత్రం ద్వారా చిత్రసీమకు పరిచయం అయ్యారు.


తెలుగు ,హిందీ, తమిళ్ భాషలతో కలుపుకొని 255 పైగా సినిమాలలో నటించడం జరిగింది. నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను కూడా నిర్మించాడు. ఇక ప్రస్తుతం ఆయన కుమారుడు నాగార్జున కూడా అంతే స్టార్డం తో కొనసాగుతున్నారు. చివరిసారిగా కడుపులో క్యాన్సర్ కణాలతో బాధపడుతూ చికిత్స చేయించి నప్పటికీ ఫలితం లేక  2014 జనవరి 22వ తేదీన స్వర్గస్తులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: