కొందరు ఈ విధంగా చేతులను చాతిపై పెట్టుకొనో లేదా చేతులు కట్టుకొనో నిద్రించే అలవాటు కలిగి వుంటారు. ఈ అలవాటు పిల్లల్లోనే కాక పెద్దలలో కూడా కనబడుతుంటుంది. ఆరోగ్యానికి హాని కలిగించేదిగా ఉండటం మూలంగా ఈ అభ్యాసాన్ని మన పూర్వలు తిరస్కరించారు.
చాతిపై(రొమ్ముభాగంపై) ఏ కాస్త బరువు పడినా గుండెపై అది ఒత్తిడిని తెస్తుంది. అలా శరీర క్రియావ్యవస్థ విరుద్దంగా ప్రబావితమౌతుంది. రక్తప్రసరణం కూడా సరిగా జరగక ఇబ్బంది కలుగుతుంది.
ఇలా చేతులు ముడుచుకొని రొమ్ములపై పెట్టుకోవడం వల్ల ఊపిరితిత్తులపై కూడా ఒత్తిడి పడుతుంది. అలా శ్వాసక్రియకు కూడా ఒత్తిడి పడుతుంది. అలా శ్వాసక్రియకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ కారణంగా అలా నిద్రించడాన్ని మన పెద్దలు ఖండించారు.
మరింత సమాచారం తెలుసుకోండి: