హిందూ సంప్రదాయంలో మంగళసూత్రానికి చాలా పవిత్రమైన స్థానం ఉంది. పెళ్లైన మహిళలు మంగళసూత్రాలు ధరించి తమ వైవాహిక జీవితానికి స్వాగతం చెబుతారు. మంగళసూత్రంలో ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు. అయితే మంగళసూత్రంలో ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి నల్లపూసలు ఎన్ని వేసుకోవాలి. మొత్తం ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం చాలామందికి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకుందాం. మంగళసూత్రం మార్చుకోవాలి అనుకునేవాళ్ళు, అందులో ఎర్ర మరియు నల్లపూసలు ఎన్ని వేసుకుంటే మంచిది అన్న అనుమానం వారికి రావచ్చు. అయితే నల్లపూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి. లేదా ఎక్కువగా వేసుకోవాలి అనుకునేవాళ్ళు, రెండు 9 లు కానీ, మూడు 9 లు కానీ వచ్చే విధంగా ఎర్ర మరియు నల్లపూసల ను మంగళసూత్రంలో వేసుకోవాలని మన శాస్త్రాలలో చెప్పబడింది.

మంగళసూత్రాన్ని మార్చుకోవాలి అనుకునేవారు, ముందుగా  పసుపు కొమ్ము కట్టిన పసుపు తాడును మెడలో వేసుకుని మాంగల్యాన్ని మెడలో నుంచి తీయాలి. మంగళ సూత్రంలో పూసలు గుచ్చుకోవాలని హడావిడిలో మెడలో పసుపు కొమ్ము కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే చాలా అశుభమని శాస్త్రాలు చెబుతున్నాయి. మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడలో నుండి అస్సలు తీయరాదు. ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీయడం ముత్తైదువకు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. కాబట్టి  పుణ్యస్త్రీలు తమ మాంగల్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి.

సాధారణంగా మంగళసూత్రం విషయంలో స్త్రీలు చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. అలాంటి వారు ఇటువంటి ఆచారాల గురించి, పద్ధతుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకుని మంగళసూత్రాన్ని పసుపు కుంకుమలు అద్ధి అమ్మవారిని ప్రార్ధించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రులు కాగలరు.

మరింత సమాచారం తెలుసుకోండి: