అఖిలాండ‌కోటి బ్ర‌హ్మాండ నాయ‌కుడు.. రాజాధిరాజ యోగిరాజ ప‌ర‌బ్ర‌హ్మ శ్రీ స‌చ్చిదానంద స‌ద్గురు మ‌హారాజ్‌కీ జై అన్న మాట వింటే చాలు శ‌రీరం పుల‌కిస్తుంది. మ‌న‌సు ప‌ర‌వ‌ళ్లు తొక్కుతుంది. ఆ ప‌దంలో ఉన్న మ‌హిమ అటువంటిది. సాక్షాత్తూ భ‌గ‌వంతుడే ఒక యోగిలా, ఒక స‌ద్గురువులా, ఒక సామాన్య మాన‌వుడిలా భూమిపైకి వ‌చ్చి మాన‌వుల్లోని దుర్ల‌క్ష‌ణాల‌ను రూపుమాపి భ‌గ‌వ‌త్ త‌త్వంపై న‌డిపించిన‌వారే శ్రీ షిరిడి సాయిబాబా. ఆయ‌న చెప్పిన మాట‌లు ముత్యాల ప‌లుకులై ఎంద‌రో జీవితాల్ని క్షేమంగా ఆవ‌లి ఒడ్డుకు చేర్చాయి. మ‌నం కూడా ఆ మాట‌ల‌ను ఒక‌సారి మ‌న‌నం చేసుకొని జీవితాల్ని సార్థ‌కం చేసుకుందాం.


1. మీరు ఎవర్నీ నొప్పించకండి !!
మీ తోటివారు, మిమ్మల్ని ఏ రకంగా కష్టపెట్టినా, వారిని క్షమించండి !!
మీకు అపకారం చేసిన వారికి కూడా,  ఉపకారమ చేయండి !!
ఇలా చేయడం వల్ల మీకు మేలు జరగడం, మనశ్శాంతి గా ఉండడమే కాదు, మీకు "హాని" చేసినవారు లేదా, మిమ్మల్ని నొప్పించిన వారిలో, పశ్చాత్తాపం  కలుగుతుంది కూడా !!

2. "శ్రద్ధ - సబూరి" చాలా అవసరం !!
మీరందరూ, "శ్రద్ధ - సబూరీ" లను,  అలవర్చుకోవాలి !!
"సహనం - విశ్వాసం" లేనివారు జీవితంలో, ఏమీ సాధించలేరు !!

3. ఏ పనిచేసినా శ్రద్ధగా చేయండి !!
అన్ని సమయాల్లో, "సహనం"తో, వ్యవహరించండి !!
ఎవరైనా ఏ కారణంగా అయినా మిమ్మల్ని, బాధించినా మీరు సహనాన్ని కోల్పోకండి !!
ఆవేశంతో, తీవ్రంగా బదులు చెప్పకండి !!
"ఓర్పు"తో మెల్లగా, నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుంచి వెళ్లిపోండి !!

4.ఇతరులు" మీపైన అనవసరంగా నింద లు వేసినా మీరు చలించకండి !!
అవి కేవలం, ఆరోపణలే అని మీకు తెలుసు కనుక నిశ్చలం గా, నిబ్బరం గా ఉండండి !!వారితో, పోట్లాట"కు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు !!

5.దేవునిపట్ల విశ్వాసం" ఉంచండి !!
ఎట్టి పరిస్థితిలో, మీ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు !!
తోటివారిలో, ఉన్న మంచి ని మాత్రమే,  చూడండి !!
వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు !!
మనకు మనం మంచి గా ఉన్నామా లేదా అని మాత్రమే చూడాలి !!

6. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ "సన్మార్గం"లో సాగిపోవాలి !!
ఇతరులు ఒకవేళ ఏమైనా, ఇబ్బందులు, కలిగిస్తున్నా, పైన "భగవంతుడు" ఉన్నాడని నమ్మండి !!
భగవంతుడు మీకు తప్పక సాయం  చేస్తాడనే "నమ్మకం" ఉంచండి !!

7. భగవంతుని వైపు మీరు ఒక అడుగు ముందు కు వేస్తే, భగవంతుడు మిమ్మల్ని కాపాడటానికి 1000 అడుగులు ముందుకు వస్తాడు !!
శ్రీ స‌చ్చిదానంద స‌ద్గురు మ‌హారాజ్‌కీ జై.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag