శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారం రోజున మంగళగౌరీ వ్రతం చేస్తే మీ కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. పెళ్లైన స్త్రీలు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయిదవతనాన్ని ప్రసాదించే మంగళ గౌరీని పూజించడం ద్వారా స్త్రీలు తమ సౌభాగ్యాన్ని పటిష్ఠం చేసుకోగలరు. అమ్మవారు మాంగళ్య బలాన్ని పెంచుతుందని వారి నమ్మకం. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే అయిదు మంగళవారాలు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం ద్వారా  అంతా శుభమే జరుగుతుంది. వారి కున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అమ్మవారి కృపతో శుభ సమయం మొదలవుతుంది. ఇక మంగళ గౌరీ వ్రతం చేసే రోజు గృహిణులు ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకుని వ్రతానికి అన్నీ సిద్దం చేసుకోవాలి.
 
ఏ వ్రతమైనా సరే ముందుగా నిత్య పూజను చేసిన తర్వాతే వ్రతమును చేయాలి. వ్రతం కోసం పసుపు గోధుమతో చేసినటువంటి  అమ్మవారిని పసుపు , కుంకుమలతో అలంకరించిన పీటపై ప్రతిష్టించాలి. అదే విధంగా పసుపుతో చేసిన గణపతిని కూడా తమలపాకుపై ఉంచాలి. అమ్మవారికి నైవేద్యంగా... తర్వాత దానికి కావలసిన పదార్థాలను కూడా సిద్ధంగా ఉంచుకుని షోడశోపచార పద్ధతిలో పూజ చేయాలి. ఈ పదార్థాలు పానకం వడపప్పు చలివిడి ఐదు రకాల పండ్లు మరియు కొబ్బరికాయ వీలైతే పాలు బెల్లం పరమాన్నం కూడా నైవేద్యంగా ప్రసాదించవచ్చు. ఈ పూజ అంతా పూర్తి చేసిన తర్వాత అంతవరకు అష్టోత్తర నామాలు సహస్ర నామాలు పారాయణ చేయాలి. గౌరీ వ్రత కథను చెప్పుకోవాలి.
మంగళగౌరీ వ్రతం చేసే రోజు స్త్రీలు పూర్తి రోజు ఉపవాసం ఉంటే మంచిది.


ఈ వ్రతానికి ముత్తైదువులను పిలిచి వాయినం ఇవ్వాలి. ముత్తైదువులు అయిదుగురికి మించి తగ్గకూడడు. వాయినం తీసుకునే ముత్తైదువులను మంగళ గౌరీగా భావించి వారి పాదాలకు పసుపు రాసి.... బొట్టు పెట్టాలి. అనంతరం వాయినం ఇస్తూ నా వాయినం పుచ్చుకుంటున్నది ఎవరు అని అడగాలి... తీసుకునే ముత్తైదువు నేనే మంగళగౌరీని అని అనాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: