నిజానికి అమ్మవారి గుళ్ళల్లో అమ్మవారికి చీరలను కట్టించిన తర్వాత, ఆ చీరలను ఏం చేస్తారు.. అనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతూనే ఉంటుంది. అంతే కాదు కొంత మంది గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో అమ్మవారికి కట్టించిన చీరలను ..పూజారులను అడిగి మరీ వాటిని ఇంటికి తీసుకెళ్తూ వుంటారు.. అమ్మవారికి కట్టించిన చీరలను మనం కట్టుకోవాలా.. లేదా.. ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలపై కొంతమంది అవగాహన లేక ఇబ్బంది పడుతూ ఉంటారు..

సాధారణంగా మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అమ్మవారి గుడిలకి వెళ్ళినప్పుడు, అక్కడ అమ్మవారికి ధరించిన పూలను.. తీసుకొని సిగ లో పెట్టుకుంటాము.. ఇక మగవారైనా సరే ,ఆడవారికైనా సరే ఒకసారి అమ్మవారికి సమర్పించబడిన పూలను మనం తీసుకొని పెట్టుకోవడం వల్ల , వారి అనుగ్రహం మనపై ఉంటుంది అని నమ్మకం.. గుళ్లో పెట్టే ప్రసాదాలను కూడా  స్వీకరిస్తూ వుంటాము.. ఇకపోతే ఇంట్లో నోములు చేసుకున్నప్పుడు అమ్మవార్లకు చీరలను సమర్పిస్తారు అనే విషయం అందరికి తెలిసిందే..

ఇలా అమ్మవారికి ఇచ్చే  చీరను తర్వాత రోజు మనం తీసుకుంటే.. ఆ చీరను దీక్ష వస్త్రంగా మాత్రమే ఉపయోగించాలి.. అంతే కానీ ఎవరు కూడా ఆ చీర కట్టుకొని ఏ ఊరి కి కూడా వెళ్ళకూడదు. నిజానికి అమ్మవారికి సమర్పించిన చీరలు  ప్రసాదంగా స్వీకరిస్తారు కాబట్టి, కేవలం ప్రసాదం గానే చూడాలి తప్ప అలంకారాల కోసం చూడకూడదు.. ముఖ్యంగా ఆ చీరలను ఏదైనా పూజ సమయంలో ధరిస్తే శుభం కలుగుతుంది.

ఇక అంతే కాదు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు రవిక ముక్క తో పాటు కుంకుమ, పసుపు కూడా ఇస్తాము.. అలాంటివి దేవతా వస్త్రం గానే భావించాలి.. అమ్మవారికి పెట్టిన చీరలు కేవలం అమ్మవారి సమక్షంలోనే కట్టుకొని పూజలు చేయడం వల్ల మనకు ఎటువంటి దోషం కలగకపోగా , అమ్మ వారి ఆశీస్సులు వస్త్రాలపై ఉంటాయి.. కొన్ని దేవాలయాల్లో అమ్మవారికి ధరించిన చీరలను వేలంపాట కూడా వేసి విక్రయిస్తుంటారు.. కొనుగోలు చేసిన వారు కూడా కేవలం పూజలు ,నోములు నోచినప్పుడు మాత్రమే ధరిస్తూ  ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: