
నాణేలు కనిపిస్తే..
దారిలో వెళ్ళినప్పుడు నాణెం ఎప్పుడైనా కంటపడితే, దానికర్థము మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారని సూచిస్తున్నట్టు.శాస్త్రం అనుసరించి,దారిలో పడిపోయిన ధనం మీ దగ్గరికి రావడానికి ముందు,ఎంతో మంది చేతులలో మెలిగి వచ్చి ఉంటుంది.అటువంటి నాణెంలో వారి పాజిటివ్ శక్తి ఆ నాణెంలోకి ప్రవేశించిస్తుందట, దానితో మీ జీవితంలో ఏదోరకమై ప్రమోషన్ కి సూచనట.కావున ఈసారి నాణెం దొరికినప్పుడు కచ్చితంగా తీసుకోండి.
డబ్బు వున్న పర్సు కనిపిస్తే..
పర్సు నిండా డబ్బు వున్న పర్సు దొరికితే,అది మనకు చాలా శుభసూచకమని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాంటి పర్సు కనిపిస్తే మన పెద్దల ఆస్తి,కలిసి వస్తుందట,అంతే కాక కోర్టు గొడవలు ఉంటే తొందరగా తీరే అవకాశాలు ఉన్నట్టు సూచనట.
బంగారం దొరికితే..
బంగారం వంటి లోహలతో కూడిన వస్తువులు దొరికితే,మనకు ఎన్ని కష్టాలు వున్నా దేవానుగ్రహం కలిగి,అవి తొందరలో తిరిపోతాయని అర్థం అని వాస్తు శాస్త్రం,సూచిస్తుంది.
వెండి వస్తువులు దొరికితే..
దారిలో వెళ్ళినప్పుడు వెండి వస్తువులు దొరికితే, వారి ఇంట్లో త్వరలో వివాహం జరగబోతోందని అర్థం.కావున ఎవరి వస్తువులు వారికి తిరిగి ఇచ్చినా సరే,కానీ మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
ఇనుప వస్తువులు దొరికితే..
ఇనుప వస్తువులు దొరికితే మాత్రం అస్సలు ముట్టుకోకూడదని,అది మన ఇంట్లో ఏదో కీడు జరగబోతోందని అర్థం.
కావున దారిలో దొరికిన వస్తువులు,ఎవరికీ వారికిచ్చిన సరే,అ వస్తువుల అనుగుణంగా వున్న ఫలితాలు మనకు లభిస్తాయి.