అతగాడు బ్యాట్ పట్టుకొని ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే పరుగుల వరద పారాల్సిందే.. ఆ ఆటగాడు ఏ మ్యాచ్ ఆడిన.. అదే మొదటి మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ అన్నట్లుగా ఆడుతూ ఉంటాడు. ఇక ఈ ఆటగాడు రికార్డులకు అయితే ఎక్కడా కొదవలేదు. అందుకే అభిమానులు అందరూ ఈ ఆటగాడిని రికార్డుల రారాజుగా పిలుచుకుంటారు. ఇక ఏ  మ్యాచ్ లోనైనా బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తూ పరుగుల వరద పారిస్తు ఉంటాడు. అందుకే ఇంకొంత మంది అభిమానులు పరుగుల యంత్రం అని కూడా పిలుస్తుంటారు. మరోవైపు జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకొని సక్సెస్ ఫుల్ గా  ముందుకు తీసుకెళ్ళాడు. అందుకే అగ్రెసివ్ కెప్టెన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంతకీ నేను ఎవరి గురించి చెబుతున్నానో  మీకు అర్థమయ్యే ఉంటుంది.. టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. 

 


 ఇప్పటికే ఎన్నో మ్యాచ్ లలో  తన సత్తా చాటుతూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ పరుగుల వరద పారించాడు విరాట్ కోహ్లీ.ఓ  వైపు జట్టు బాధ్యతలను భుజాలపై వేసుకొని విజయవంతంగా జట్టును సమన్వయం చేస్తూ ముందుకు నడిపిస్తూనే మరోవైపు జట్టులో కీలక ఆటగాడిగా అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ పరుగుల వరద పారిస్తూ  ఉన్నాడు. ఇప్పటికే తన అద్భుతమైన బ్యాటింగ్ తో  పరుగుల వరద పారించి  ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్ లు  నెలకొల్పిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తన పేరును లిఖించుకున్నాడు విరాట్ కోహ్లీ. అంతే కాకుండా ప్రపంచంలోనే నెంబర్వన్ బ్యాట్స్మన్ గా  కూడా కొనసాగుతున్నాడు. 

 


 ఇక తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైపోయాడు. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో 133 పరుగులు చేస్తే వన్డేల్లో అత్యంత తక్కువ సమయంలో 12000 పరుగులు  పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు.  అయితే ఇప్పటివరకు ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ టెండూల్కర్ 300 ఇన్నింగ్స్ లలో  12000 పరుగులు  పూర్తిచేశాడు. ఇక విరాట్ కోహ్లీ 239 ఎన్నికలలోనే 11867 పరుగులు చేయడం విశేషం. కాగా ఈ నెల 12న ధర్మశాలలో సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరుగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: