దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ మాజీ ఆటగాడు అయినా ఏబి  డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎబి డివిలియర్స్ ఒకసారి మైదానంలోకి అడుగుపెట్టాడు  అంటే బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. అలాంటి గొప్ప ఆటగాడు ఎబి డివిలియర్స్. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్ల లో ఒకడు. అయితే ఎబి డివిలియర్స్ గతంలో రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ మళ్లీ జట్టులోకి రావాలని ఆశిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏబీ  డివిలియర్స్ రీ ఎంట్రీ పై మళ్ళీ సందిగ్దత నెలకొంది. అయితే 2018 ఐపీఎల్ సీజన్ తర్వాత ఎవరూ ఊహించని విధంగా అనూహ్యమైన నిర్ణయం తీసుకొని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు ఎబి డివిలియర్స్. 

 

 

 ఇక ఆ తర్వాత 2019 వన్డే ప్రపంచకప్ లో  ఆడాలని అనుకున్నప్పటికీ పలు విమర్శల కారణంగా ఎబి డివిలియర్స్ జట్టులో స్థానం సంపాదించలేక పోయాడు. ఎందుకంటే 2018 ఐపీఎల్ సీజన్ తర్వాత... జుట్టు పరిస్థితి గురించి ఎలాంటి ఆలోచన చేయకుండా స్వార్థపూరితంగా రిటైర్మెంట్ ప్రకటించడం పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అందుకే 2019 వన్డే ప్రపంచకప్ లో  ఎబి డివిలియర్స్ ఆడాలని అనుకున్నప్పటికీ పలువురు సీనియర్ల విమర్శల కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది.ఇక ఆ తర్వాత  ప్రపంచ కప్ లో  దక్షిణాఫ్రికా జట్టు  ఎంత ఘోరంగా విఫలమైనదో  అందరికీ తెలిసిన విషయమే. నిలకడలేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది దక్షిణాఫ్రికా జట్టు. 

 

 

 ఈ నేపథ్యంలో 2020 అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ కి  దక్షిణాఫ్రికా జట్టులో డివిలియర్స్ లాంటి అనుభవజ్ఞుడైన అద్భుతమైన ఆటగాడు ఉంటే ఎంతో మంచిది అని ప్రస్తుతం అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం జట్టు నిలకడలేని తో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డివిలియర్స్ రీఎంట్రీ సుగమం అయింది అనుకున్నారు అందరు. ఈ సంవత్సరం జరగబోయే ఐపీఎల్ సీజన్ లో మరోసారి తన ఫామ్ నిరూపించుకొని అందరి నోళ్ళు మూయించాలి  అని అనుకున్నాడు ఏబి డివిలియర్స్. కానీ ఐపీఎల్ సీజన్ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ అసలు జరుగుతుందో అన్నది కూడా సందేహం గానే ఉంది. ఈ నేపథ్యంలోనే  2020 ప్రపంచకప్ లో  డివిలియర్స్ ఆడతాడా లేదా అన్నది కూడా ప్రస్తుతం సందిగ్ధంగా మారిపోయింది. తాజాగా తన రిటైర్మెంట్ పై స్పందించిన డివిలియర్స్ మాట్లాడుతూ... కరోనా  వైరస్ కారణంగా రాబోయే 12 నెలల క్రికెట్ షెడ్యూల్ పై సందిగ్ధత నెలకొంది... ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే ఈ పరిస్థితుల్లో క్రికెట్ పరంగా ఎలాంటి నిర్ణయానికి రాలేక పోతున్నాను అంటూ తెలిపాడు ఎబి డివిలియర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: