టీమిండియాలో మరొక ప్లేయర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.టీమిండియా లో ఒకప్పుడు మంచి వికెట్ కీపర్ గాను,బ్యాట్స్ మెన్ గాను,తనదైన ఆటతో అలరించిన పార్దివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై పలుకుతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.టీమిండియాతో 18 ఏళ్ల తన క్రికెట్‌ ప్రయాణాన్ని ముగించాలనుకుంటున్నట్లు భావోద్వేగంతో తెలిపాడు.

 టీమిండియా తనపై విశ్వాసాన్ని,నమ్మకాన్ని ఉంచి 17 ఏళ్ల చిన్నవయసులోనే అవకాశం కల్పించిందని అన్నాడు.నా కెరీర్‌లో మార్గదర్శకం చేస్తూ అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు’’ అంటూ పార్థివ్ భావోద్వేగంతో‌ పేర్కొన్నాడు. కెప్టెన్లందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. తొలి అవకాశం ఇచ్చిన గంగూలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. భారత్ తరఫున పార్థివ్‌ 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు.

2002లో గంగూలీ కెప్టెన్సీలోనే పార్థివ్‌ ఇంగ్లాండ్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం చేశాడు. శ్రీలంకతో 2012 లో చివరి వన్డే ఆడాడు..ఐ‌పి‌ఎల్ లో 13 సీజన్లకు గాను అతడు ముంబయి, చెన్నై, బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశవాళీ క్రికెట్‌ లో సత్తాచాటాడు. 194 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 11,240 పరుగులు చేసిన పార్దివ్ 27 శతకాలుతో కెరియర్ బెస్ట్ రికార్డులు నమోదు చేశాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: