ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇలాంటి ఘటనలు చూస్తుంటే మన దేశంలో కేవలం కొన్ని రకాల క్రీడలకు మాత్రమే ప్రాముఖ్యత ఉందా అనిపిస్తుంది. ఇక మిగతావన్నీ వృధానేనా అనిపిస్తూ ఉంటుంది. క్రికెట్ లో ఎవరైనా ఆటగాడు సెంచరీ చేశాడు అంటే అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ప్రశంసిస్తారు. బ్యాట్మెంటన్ లో ఒక్క పథకం వచ్చిందంటే దేశమంతా ప్రచారం చేస్తారు. మిగతా క్రీడలు ఆటగాళ్లు దేశం తరఫున ప్రాతినిధ్యం వహించి ఎన్నో పథకాలు సాధించినప్పటికీ ఎవరూ పట్టించుకోరు.
అంతేకాదు దేశం తరపున మెడల్ సాధించిన వారు చివరికి పొట్టకూటి కోసం నానా తంటాలు పడుతుంటే చూసిచూడనట్లు గానే ఉంటారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇలాగే అనిపిస్తుంది. ఆమె ప్రపంచస్థాయి షూటర్.. ఎన్నో ఏళ్ల పాటు భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించింది. 28 స్వర్ణాలు, 5 వెండి పతకాలు సాధించింది. అయితే ఆర్థిక కష్టాలు ఆమె కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పరిహారం అందకపోవడంతో కుటుంబ పోషణ కోసం అప్పుడు షూటింగ్ చేసి మెడలల్స్ సాధించిన అదే చేతులతో.. ఇప్పుడు రోడ్డుపై చిప్స్ అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఉత్తరాఖండ్కు చెందిన షూటర్ దిల్ రాజు కౌర్. ఆమె దయనీయ స్థితికి సంబంధించిన ఒక ఫోటో బయటికి రావడంతో ఇక ఆ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి