అంతర్జాతీ

య క్రికెట్‌కు వీడ్కోలు పలికాక ప్రకృతి ప్రేమికుడిగా మారిపోయిన భారత జట్టు మాజీ కెప్టెన మహేంద్ర సింగ్‌ ధోనీ రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగుబడి ప్రారంభించాడు. గోధుములు, కూరగాయాలు, పండ్లతోటలను సాగు చేయడంతో పాటు కడఖ్‌నాథ్‌ కోళ్ల ఫారమ్‌, డెయిరీ ఫామ్‌ను కూడా మహీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెయిన్టెయిన్ చేస్తున్నాడు. అంతేకాక, తన ఫామ్‌హౌస్‌ మొత్తం మొక్కలు బాగా నాటి పచ్చగా మార్చేశాడు. నేచర్‌ లవర్‌గా మారిన ధోనీని స్థానిక పర్యావరణవేత్త అమన్ సింగ్‌ సిమ్లాలో కలిసి అక్కడి సంప్రదాయ టోపీలను బహూకరించి.. అడువుల పరిరక్షణకు కృషి చేయాల్సిందిగా కోరాడు.

దీంతో మహీ తాజాగా అభిమానులకు సోషల్‌ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి సిమ్లాలో పర్యటిస్తున్న ఈ వెటరన్ వికెట్‌కీపర్‌ అక్కడి మీనా బాగ్‌ విల్లాలో బస చేస్తున్నాడు. శుక్రవారం ఆ విల్లా బయట ఉన్న చెక్క బోర్డుపై ‘మొక్కలు నాటండి.. అడువులను కాపాడండి’ అని తన స్వహస్తాలతో రాసి దాని కింద ధోనీ సంతకం చేశాడు. ఆ బోర్డు పక్కన నిలబడి ధోనీ దిగిన ఫొటోను చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు అధికారిక ఇన్ స్టా, ట్విట్ట‌ర్‌ ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. తమ సారథి అభిమానుల మదిలో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలను నాటుతాడంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చి సీఎస్కే షేర్‌ చేసింది. దీనికి ధోనీ అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఇన్ స్టాలో అయితే, ఈ పోస్ట్‌కు ఇప్పటికే దాదాపు 6.5 లక్షలకు పైబడి లైకులు రావడం విశేషం. ఇక‌, దుబాయ్‌లో జరిగిన గ‌త సీజ‌న్ ఐపీఎల్‌లో ఎన్న‌డూ లేని విధంగా పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున నిలిచిన సీఎస్కే.. ఈ ఏడాది ఐపీఎల్‌లో తిరిగి పుంజుకుంది. కొవిడ్‌తో వాయిదా ప‌డిన తాజా ఐపీఎల్ నిలిచిపోయే స‌మ‌యానికి చెన్నై పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో నిలిచింది.ల‌

మరింత సమాచారం తెలుసుకోండి: