టీమిండియా యువ సంచలనం పృథ్వీషా ఇటీవలే ఐపీఎల్లో ఎంతో అద్భుతంగా రాణించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరపున ఆడిన పృథ్వీ షా  పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలోనే ఇక ఇటీవలే పృద్వి షా శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా జట్టులో ఎంపిక య్యాడు. ఇక శ్రీలంక పర్యటనలో పృథ్వీ షా తనని తాను మరింత నిరూపించుకోవడానికి మంచి సమయం అని అందరూ అనుకున్నారు.ఈ క్రమంలోనే అద్భుతంగా రాణిస్తాడు అని భావించారు. ఈ కాగా ఇక మొదటి వన్డే మ్యాచ్లో  ఏకంగా 24 బంతుల్లో 9 ఫోర్లు బాదాడు పృథ్వీ షా.  రెండో వన్డే మ్యాచ్లో కూడా ఇలా ఫోర్లతో విరుచుకుపడినప్పటికి ఆ తర్వాత మాత్రం చివరికి బౌలర్ వ్యూహం ముందు వికెట్ కోల్పోయాడు.



 వరుసగా రెండో వన్డేలోను శ్రీలంకపై స్పిన్నర్ బౌలింగ్లో తడబడి వికెట్లు చేజార్చుకున్నారు టీమిండియా యువ బ్యాట్స్మెన్ పృథ్వీ షా. ఇక ఇటీవలే కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఓటమి లాంఛనమే అని అనుకున్న సమయంలో ఇండియా బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే నిన్న జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఓపెనర్ పృథ్వీ షా మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. కానీ శ్రీలంక స్పిన్నర్ బౌలింగ్ లో చివరి బంతి అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ముందుగా అతని బౌలింగ్లో వరుసగా నాలుగు ఫోర్లు బాదాడు.


 దీంతో ఇక పృథ్వీ షా దూకుడుతో అటు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఇక అప్పటికి 4 ఫోర్లు బాదడంతో ఆ బౌలర్ ఎంతో కసితో ఉన్నాడు. ఎట్టిపరిస్థితుల్లో వికెట్ తీయాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే తొలి వన్డే మాదిరిగానే రెండవ వన్డేలో కూడా శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ఫలితం రాబట్టాడు. బౌలర్ విసిరిన బంతిని సాహసోపేతంగా కట్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు పృథ్వీ షా.  కానీ బ్యాట్ కి దొరకని బంతి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో ఇక పృథ్వీ షా వికెట్ కోల్పోయి నిరాశతో మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: