ప్రస్తుతం టీమిండియాలో కీలక పేసర్ గా కొనసాగుతున్నాడు జస్ప్రీత్ బుమ్రా. ఐపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రిత్ బూమ్రా టీమిండియా లో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రతీ ఫార్మాట్ లో కూడా కీలక ఆటగాడిగా మారిపోయాడు. తనదైన ప్రదర్శనతో ఇక టీమిండియా లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  ప్రస్తుతం జట్టులో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు ఎలాగో జస్ప్రిత్ బూమ్రా కూడా అదే స్థాయిలో కీలకమైన ఆటగాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  దాదాపుగా టీమిండియా జస్ప్రిత్ బూమ్రా లేకుండా టీమిండియా  మ్యాచ్ ఆడటానికి ప్రయత్నించదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 ఇక తనదైన శైలిలో బౌలింగ్ చేస్తూ అటు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెడుతూ ఉంటాడు జస్ప్రిత్ బూమ్రా.  ఇక అద్భుతమైన యార్కర్ లు విసురుతూ కీలక సమయంలో వికెట్లు పడగొడుతూ ఉంటాడు. అంతేకాదు ఇప్పటి వరకు ఎన్నో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర వహించాడు జస్ప్రిత్ బూమ్రా. అయితే  మిగతా బౌలర్లతో పోల్చి చూస్తే జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. ఒక రకంగా బుమ్రా బౌలింగ్ కి ఆ రేంజ్ లో క్రేజ్ రావడానికి ఆ బౌలింగ్ యాక్షన్ కూడా ఒక కారణం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.



 అయితే బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా త్వరలోనే అతని కెరియర్కు బ్రేక్ పడే అవకాశం ఉందని అతను ఎక్కువగా గాయాల బారిన పడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు మాజీ క్రికెటర్లు.  ఇక ఇటీవలే పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ బుమ్రా బౌలింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా  బౌలింగ్ యాక్షన్ ఎంతో విభిన్నంగా ఉంటుందని ఆ యాక్షన్ ఉన్న బౌలర్లు వారి వెన్ను భుజంతో వేగంగా బంతి విసర గలుగుతారు   అంటూ చెప్పుకొచ్చారు. కానీ బుమ్రా బౌలింగ్ యాక్షన్ కారణంగా ఏకంగా గాయాల బారిన పడే అవకాశం ఉంటుందని.  బీసీసీఐ దృష్టి సారించి ఇక టీమిండియాలో కీలక బౌలర్ అయిన బుమ్రా ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు షోయబ్ అక్తర్.

మరింత సమాచారం తెలుసుకోండి: