ఇక అదేరీతిలో టోక్యో ఒలంపిక్స్ లో కూడా రాణిస్తూ పథకానికి చేరువగా దూసుకుపోతూ ఉంటారు. కానీ ఇటీవల జరుగుతున్న టోక్యో ఒలంపిక్స్ లో మాత్రం ఎంతో మంది యువ ఆటగాళ్లు కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ.. అలవోకగా పథకానికి చేరువగా దూసుకుపోతున్నారు. మరికొంతమంది అథ్లెట్లు ఏకంగా బంగారు పతకాలను సైతం సాధించి తమ సత్తా చాటుతున్నారు. ఇక భారత్కు చెందిన ఎంతో మంది క్రీడాకారులు కూడా పతకం సాధించడమే లక్ష్యంగా అద్భుతంగా రాణిస్తున్నారు అనే విషయం తెలిసిందే.
అయితే విశ్వ క్రీడలు అయిన టోక్యో ఒలంపిక్స్ లో పోటీ పడుతున్నప్పటికీ కొంతమంది ఆటగాళ్ల పేర్లు మాత్రం దాదాపుగా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కోవలోకి వచ్చే వారిలో రీచ్ గేమ్ అయిన గోల్ఫ్ ఆడే ఆటగాల్లు కూడా కొంతమంది అయితే ఇటీవలే రిచ్ గేమ్ గా పిలువబడే గోల్ఫ్ ఆట లో భారత్కు చెందిన అతిధి అశోక్ ఇటీవలే టోక్యో ఒలంపిక్స్ లో బరిలోకి దిగింది. అంతే కాకుండా ఇటీవలే అద్భుతంగా రాణించారు. ఇటీవలే జరిగిన పోటీలలో ఎంతో అనుభవం ఉన్న విదేశీయులకు సైతం పోటీ నిస్తూ టాప్ లో నిలిచింది అతిథి అశోక్. దీంతో ఇక ప్రస్తుతం రెండవ రౌండ్ కి క్వాలిఫై అయింది. ఇక అతిథి అశోక్ కుమార్ మరిన్ని రౌండ్లు గెలిచి పథకం గెలవాలి అని ప్రస్తుతం భారతీయులందరూ ఆకాంక్షిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి