ఇప్పటికే ఎన్నో రకాల రికార్డులను కొల్లగొట్టిన జస్ప్రిత్ బుమ్రా ఇక ఇప్పుడు మరో అరుదైన రికార్డును కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నాడూ. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టాడు అంటే అత్యంత వేగంగా టెస్ట్ క్రికెట్ లో 100 వికెట్లు తీసిన బౌలర్గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంటాడు. భారత అంతర్జాతీయ జట్టులోకి 2018లో అరంగేట్రం చేసిన జస్ప్రిత్ బూమ్రా ఇప్పటివరకు 22 టెస్టులు ఆడాడు. ఇక 22.62 సగటుతో 95 వికెట్లు పడగొట్టాడు
ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల మైలురాయిని కూడా సాధించాడు జస్ప్రిత్ బూమ్రా. ఇక ఇటీవలే లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులలో జస్ప్రిత్ బూమ్రా ఆకట్టుకున్నాడు. ఇక ఇటీవల కాలంలో బంతితో మాత్రమే కాదు బ్యాట్తో కూడా సత్తా చాటుతున్నాడూ. ఇక పోతే ఇక ఇప్పుడు అరుదైన రికార్డు పై కన్నేసాడు బుమ్రా. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో వేగంగా వంద వికెట్లు పడగొట్టిన భారత ఫాస్ట్ బౌలర్ల జాబితాలో కపిల్దేవ్ టాప్ లో ఉన్నాడు. ఇరవై ఐదు టెస్టుల్లో 100 వికెట్ల మార్కును చేరుకున్నారు కపిల్ దేవ్ ఒకవేళ బుమ్రా లీడ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 100 వికెట్లకు చేరుకున్నాడు అంటే కేవలం 23 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించి అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన తొలి క్రికెటర్గా మొదటి స్థానానికి చేరుతాడు జస్ప్రిత్ బూమ్రా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి