ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఇక ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సిరీస్ లొ భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్ లొ అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు విజయం సాధించింది. ఇక ప్రస్తుతం మూడో మ్యాచ్ ఎంతో హోరాహోరీగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఎవరు గెలుస్తారు అన్నదానిపై కూడా ప్రస్తుతం ఊహకందని విధంగా ఉంది పరిస్థితి. ఇక పోతే క్రికెట్ అన్న తర్వాత ఎన్నో నిబంధనల మధ్య జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘించడం లాంటివి చేస్తూ ఉంటారు.



 అలాంటివి చేసిన సమయంలో ఆటగాళ్ళు భారీగా జరిమానా చెల్లించడం లాంటివి కూడా చూస్తూ ఉంటామ్. మరి కొన్నిసార్లు ఇక మైదానంలో ఆటగాళ్లను ఫీల్డ్ అంపైర్లు హెచ్చరిస్తుంటారు. ఇక్కడ  భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ రెండవ రోజున ఇలాంటి తరహా ఘటన జరిగింది. మ్యాచ్ సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఫీల్డ్ అంపైర్ కన్నూ అటు ఆ వికెట్లు వెనకాల కీపింగ్ చేస్తున్న రిషబ్ పంత్ గ్లౌస్ పైన పడింది.  గ్లౌస్ సహజంగా కాకుండా ఏదో తేడాగా కనిపిస్తుంది అని గమనించాడు.  చూస్తే ఇక గ్లౌస్ కి టేపు అతికించి ఉంది అన్న విషయాన్ని గుర్తించాడు.



 వెంటనే రిషబ్ పంత్ ని పిలిచి  గ్లౌస్ నుంచి టేప్ తీసేయాలి అంటూ హెచ్చరించాడు. సాధారణంగా కీపర్ గ్లౌస్ ఎలా ఉంటుందో దాదాపుగా అందరికీ తెలుసు  బొటనవేలు చూపుడు వేలు మాత్రమే జాయింట్ అయి ఉంటుంది. మిగతా మూడు వేళ్ళు లకు సంబంధించిన గ్లౌజ్ సపరేట్ గానే ఉంటుంది.  కానీ ఇటీవలే రిషబ్ పంత్ ధరించిన గ్లౌస్ లో మాత్రం బొటన వేలు చూపుడు వేలుతో పాటు అటు ఉంగరం వేలు చిటికెన వేలు కూడా కలిసే విధంగా టేప్ అతికించారు. ఇది గమనించిన ఫీల్డ్ అంపైర్ తొలగించాలి అని సూచించడంతో వెంటనే పంత్ తొలగించాడు.  అయితే రిషబ్ పంత్ ఎందుకు టేప్ తొలగించాడు అన్నది మాత్రం అక్కడున్న వారికి చాలా మందికి అర్థం కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: