శ్రీరెడ్డి.. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఏం మాట్లాడినా ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా అది క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక వివాదాస్పద విషయాల్లోనే ఎక్కువగా స్పందించడం ఈ అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. ఏ విషయాన్ని అయినా చిటికెలో వివాదంగా మార్చేస్తూ ఉంటుంది శ్రీ రెడ్డి. ఇక ఎన్నో ఆసక్తికర పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది శ్రీరెడ్డి. ఏకంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని టార్గెట్ చేస్తూ  సంచలన వ్యాఖ్యలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.


 ఇటీవలే మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర పరాభవం పాలైంది. ఏకంగా 78 పరుగుల తో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఘోరంగా ఓడిపోయింది టీమిండియా. ఇక ఇటీవలే మూడో మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు గెలవడంతో ప్రస్తుతం 1-1 తో సమానం గా నిలిచాయి ఇరుజట్లు. అయితే అంతకు ముందు బ్యాటింగ్ లో కూడా పేలవ ప్రదర్శన చేసింది. ఏకంగా మొదటి వికెట్ నుంచి చివరి వికెట్ వరకు కేవలం 54 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించేశారు ఇంగ్లాండ్ బౌలర్లు. ఇక కోహ్లీ జట్టు ఆటతీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.


 ముఖ్యంగా కోహ్లీ చెత్త బ్యాటింగ్ చేయడంపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. కోహ్లీ అసమర్థత వల్లే ఇంత ఘోర పరాజయం అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ లిస్టులో కి అటు సెన్సేషనల్ శ్రీరెడ్డి కూడా వచ్చేసింది. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాలని.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి పనికిరాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిపోయింది. కోహ్లీ ఒక చెత్త ఆటగాడని.. అతడు కెప్టెన్సీ  పరమ చెత్తగా ఉందని రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది అంటూ వరుసగా కామెంట్లు చేసి తన ఆగ్రహాన్ని వెళ్ళగక్కింది ఈ సెన్సేషనల్ బ్యూటీ. కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా లార్డ్స్ లో విజయం సాధించింది కదా అంటే ఆ మ్యాచ్లో కోహ్లీ పాత్ర హీరో అంటూ అభిమానులకు కూడా గట్టిగానే బదులిచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: