విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీరిద్దరూ టీమ్ ఇండియా లో ఎంత కీలకమైన ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ లేకుండా టీమిండియా దాదాపుగా మ్యాచ్ ఆడలేదు అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టీమిండియా లో మూడు ఫార్మాట్ లలో కూడా ఎంతో కీలకమైన ఆటగాళ్లు ఇద్దరు. అంతేకాదు టీమిండియాను ఎప్పుడు టాప్ ప్లేస్ లో నిలపడంలో వీరిద్దరిదీ కూడా ఎంతో కీలకమైన పాత్ర అని చెప్పాలి. ఇలా టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న ఇద్దరు ఆటగాళ్లకు ఎన్నో రోజుల నుంచి అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది.



 కొన్ని విషయాలలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని ఇక వీరిద్దరూ ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు అంటూ ఎన్నో వార్తలు హల్ చల్ చేశాయి. అదే సమయంలో ఇక ఇద్దరు ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రెచ్చగొట్టే విధంగా విమర్శలు చేసుకుంటూ ఇక వీరి మధ్య నిజంగానే వివాదం ఉంది అన్న దానికి బలం చేకూర్చింది. అదే సమయంలో ఇద్దరు ఆటగాళ్ళ ప్రవర్తనా కూడా అప్పుడప్పుడు ఈ వార్తలకు బలం ఇచ్చింది. కానీ  ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య ఉన్న చనువు చూస్తుంటే ఇక వీరిద్దరి మధ్య గొడవలు కాస్త సమసిపోయాయని స్నేహితులుగా మారిపోయారు అనే విషయం తెలుస్తుంది.



 ఇక ఈ విషయాన్ని తెలిపే విధంగా ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇటీవల ఇంగ్లాండ్ తొ టెస్ట్ సిరీస్ లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది టీమిండియా  ఈ క్రమంలోనే నాలుగో టెస్టులో రోహిత్ శర్మ సెంచరీ కొట్టి అదరగొట్టాడు. ఇక కెరీర్ లో తొలి ఓవర్సీస్ శతకాన్ని అందుకున్నాడు రోహిత్ శర్మ. 204 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే రోహిత్ శర్మ సెంచరీ చేస్తే గ్యాలరీ లో ఉన్న ఆటగాళ్లు కోచ్ లు సైతం స్టాండింగ్ ఒవేషన్ తో అభినందనలు తెలిపారు. ఇక కెప్టెన్ కోహ్లి అయితే తానే స్వయంగా సెంచరీ చేసినంత ఆనందంగా ఫీల్ అయ్యాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నో రోజుల నుంచి మేము  కోరుకుంటుంది కూడా ఇదే మీ ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉంటే చాలా బాగుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: