టి20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఫై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగానే పాకిస్తాన్ భారత్ మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అది హై వోల్టేజీ మ్యాచ్ గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే భారత్ అన్ని దేశాలతో క్రికెట్ మ్యాచ్లు ఆడుతుంది. కానీ అటు పాకిస్థాన్తో ద్వైపాక్షిక మ్యాచ్లో ఆడటం మాత్రం ఎన్నో ఏళ్ల కిందటే నిషేధించింది. ఇక భారత్ పాకిస్థాన్ దేశాలు చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేవలం  వరల్డ్ కప్ లో మాత్రమే ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి.



 దీంతో ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే చాలు ఇరు దేశాల క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఉత్కంఠగా అటు టీవీ వీక్షిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా అటు భారత్ విజయం సాధించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పాకిస్తాన్ పై పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని కూడా కొనసాగిస్తుంది. ఇక ఈ సారి కూడా టీమిండియా జట్టు హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.  ఇలాంటి సమయంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం భారత్ తో మ్యాచ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.



 ఆదివారం టీమిండియాతో జరగబోయే మ్యాచ్ లో కచ్చితంగా విజయం సాధిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ ఆజమ్. అయితే ఇప్పటివరకూ వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా పాకిస్తాన్ ను ఓడించలేదు అన్నది వాస్తవమే కానీ ఇప్పుడు మాత్రం టీం ఇండియా ను ఓడించి చరిత్ర తిరగరాస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఆదివారం జరగబోయే మ్యాచ్ లో తమ జట్టుకే కలిసి వస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు బాబర్ అజమ్.. మ్యాచ్ మాత్రం కౌంటర్ కు ఎన్కౌంటర్ల సాగుతుంది అంటూ తెలిపాడు. అయితే బాబర్ అజమ్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి పాకిస్తాన్ భారత్ మ్యాచ్ పై తీవ్రస్థాయిలో ఉత్కంఠ పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: