ఇకపోతే ఇటీవల డేవిడ్ వార్నర్ ప్రపంచ కప్ లో కూడా ఆస్ట్రేలియా విజయం సాధించి సెమీ ఫైనల్కు చేరుకోవడం లో కీలక పాత్ర వహించాడు అని చెప్పాలి. వరుసగా అన్ని మ్యాచ్ లలో కూడా అద్భుతంగా రాణించిన డేవిడ్ వార్నర్ ఇక జట్టును విజయతీరాలకు వైపు నడిపించాడు. ఇకనిన్న పాకిస్తాన్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో కూడా డేవిడ్ వార్నర్ అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. ఒకవైపు వికెట్లు వరుసగా పోతున్నప్పటికీ ఎక్కడ దూకుడు తగ్గించకుండా అదిరిపోయే బౌండరీలు కొడుతూ అటు పాకిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి తీసుకు వచ్చాడు డేవిడ్ వార్నర్. అయితే డేవిడ్ వార్నర్ ఆటను అందరూ ప్రశంసిస్తున్నారు అని చెప్పాలి.
ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ నిన్న సెమీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా డేవిడ్ వార్నర్ కొట్టిన ఒక సిక్సర్ పై మాత్రం ప్రస్తుతం ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉండటం గమనార్హం. పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ వేసిన డెడ్ బాల్ ను వార్నర్ సిక్స్ కొట్టాడు. అయితే వార్నర్ ఇలా డెడ్ బాల్ ను వదిలేయకుండా సిక్స్ కొట్టడం పై ప్రస్తుతం కొంతమంది మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ఇదేం క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశ్నిస్తున్నారు ఇటీవల ఇదే విషయంపై స్పందించిన భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ వార్నర్ తీరు సిగ్గుచేటు అని విమర్శించారు. డేవిడ్ వార్నర్ చేసింది కరెక్ట్ అయితే తను చేసే మన్కడింగ్ కూడా కరెక్ట్ అంటూ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి