ఇక రాహుల్ ఒక్కడే సెంచరీ సాధించి 122 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మొదటి రోజును ముగించాడు. ఈ రోజు కనీసం ఒక్క ఓవర్ కూడా జరగకుండా ముగిసిపోయింది. ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షంతో గ్రౌండ్ మొత్తం నీటితో నిండిపోయింది. టీమిండియా ఒకింత నిరాశ పడి ఉంటుంది. ఇక మూడు రోజులే మిగిలి ఉండడంతో కనీసం రేపు అయినా మ్యాచ్ జరుగుతుందా అనే సందేహంలో ఉంది. రేపు కనుక మ్యాచ్ జరగకపోతే విజయావకాశాలు తక్కువే. కాగా కె ఎల్ రాహుల్ కెరీర్ లో ఇప్పటి వరకు 41 టెస్ట్ లు ఆడాడు.
కానీ ఇతని వ్యక్తిగత అత్యధిక స్కోర్ 199 పరుగులు మాత్రమే. కనీసం ఈ మ్యాచ్ లో అయినా డబల్ సెంచరీ చేస్తాడేమో చూడాలి. కె ఎల్ రాహుల్ ఈ సిరీస్ లో వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం వలన అదనపు బాధ్యత పడింది. కాబట్టి ఎక్కడా అజాగ్రత్తకు పోకుండా ఆచితూచి ఆడుతున్నాడు. మరి రాహుల్ కు డబల్ సెంచరీ చేసే అదృష్టం దక్కుతుందా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి