ఆయన కోచింగ్ ఆధ్వర్యంలోనే జట్టు ఎన్నో విజయాలు సాధించింది.. సీనియర్ ఆటగాళ్లు అనుభవం సాధించారు.. యువ ఆటగాళ్లు రాటు దేలారు. ఎన్నో ప్రతిష్టాత్మకమైన విజయాలను కూడా సాధించింది జట్టు. జట్టు అద్భుతమైన విజయాలు సాధించడంతో ఆయనకు మంచి పేరు కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అంతా తారుమారైంది. ఉన్నఫలంగా ఆయన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. మీరు కూడా షాక్ అవుతున్నారు కదా.. అయితే ఇది భారత క్రికెట్ లో కాదులేండి.


 ఆస్ట్రేలియా క్రికెట్ లో ఆస్ట్రేలియా జట్టు హెడ్ కోచ్గా కొనసాగుతున్నారు లాంగర్.  ఎన్నో రోజుల నుంచి జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇక ఆయన కోచింగ్ లోనే ఆస్ట్రేలియా జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది అని చెప్పాలి. ఇటీవల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన యాషెస్ టెస్ట్ సిరీస్లో కూడా అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు.. దిగ్గజ ఇంగ్లాండ్ ను మట్టి కరిపించి చిత్తు చేసింది.


 కానీ ఇటీవలే ఆస్ట్రేలియా హెడ్ కోచ్  పదవికి ఆయన రాజీనామా చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా అయితే ఆయన కోచ్ పదవి కాలం జూన్ నాటికి ముగియనుంది. ఈ క్రమంలోనే జట్టుకు హెడ్ కోచ్గా కొనసాగాలని కోరిక మాత్రం ఆయన మనసులో అలాగే ఉండిపోయింది.. ఇక ఇదే కోరికను అటు క్రికెట్ బోర్డు సభ్యుల ముందు ఉంచారు. దీర్ఘకాలం పాటు తనను కోచ్ పదవి కొనసాగించాలంటూ కోరారు. కానీ బోర్డు ససేమిరా అంది. దీంతో జూన్ లో కాదు ఇప్పుడే రాజీనామా చేస్తాను అనుకొని చివరికి హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పేశారు. అయితే జట్టులో ఆటగాళ్ళ తోనూ లాంగర్  విభేదాలు ఉన్నాయంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఆయన స్థానంలో మెక్ డొనాల్డ్స్ కొత్త కోచ్ గా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశముంది..

మరింత సమాచారం తెలుసుకోండి: