ఇకపోతే టెస్టు సిరీస్కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ గా ఉన్న దీపక్ చాహర్ ఇటీవలే వెస్టిండీస్తో జరిగిన మూడవ టి20 మ్యాచ్ లో గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే మధ్యలోనే మైదానం వీడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే శ్రీలంకతో ఆడబోయే వరుసగా సిరీస్ లకు కూడా దీపక్ చాహర్ అందుబాటులో ఉండటం కష్టమే అని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే దీపక్ చాహర్ శ్రీలంకతో సిరీస్కు దూరమయ్యాడు. దీంతో భారత అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు.
ఇక ఇప్పుడు టీమిండియా కు మరో ఎదురు దెబ్బ తగిలింది అని తెలుస్తోంది. శ్రీలంకతో రేపటి నుంచే టి20 సిరీస్ ప్రారంభం కావాల్సి ఉండగా ఈ సిరీస్కు ముందు ఊహించిన షాక్ తగిలింది. వెస్టిండీస్తో జరిగిన వరుస సిరీస్లలో అదరగొట్టి మంచి ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ గాయంతో శ్రీలంక సిరీస్కు దూరమయ్యాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ చేతికి గాయం అయినట్లు తెలుస్తుంది. దీంతో నిన్న ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదు ఈ యువ ఆటగాడు. దీంతో ఇక ఇతను శ్రీలంకతో జరిగే టీ-20 సిరీస్కు అందుబాటులో కి వస్తాడా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి