క్రికెట్ వైపు అతను ఎలా వచ్చాడు అన్న విషయాలను చెప్పుకొచ్చాడు. నా కెరీర్ విషయంపై అమ్మానాన్నల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేది.. నేను జాబ్ చెయ్యాలా.. లేకపోతే చదువుకో అనేదానిపై రోజు పెద్ద చర్చ జరిగేది. కానీ నా ధ్యాసంతా క్రికెట్ పైనే ఉండేది. చదవడం జాబ్ చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ విషయాన్ని పేరెంట్స్ కి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇక ఈ విషయం చెప్పడానికి సహకరించారు మామయ్య. అయితే అతనికి ఒక క్రికెట్ క్లబ్ ఉంది. మా వాళ్ళు చెప్పిందంతా విని మామయ్య నన్ను క్రికెట్ క్లబ్ కి తీసుకెళ్తానని పేరెంట్స్ తో చెప్పారు.
అక్కడికి వచ్చి సిరాజ్ ఆడతాడు. ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంటూ పేరెంట్స్ ని ఒప్పించాడు. ఈ క్రమంలోనే ఆడిన తొలి మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తీశాను. ఇక అది చూసి మామయ్య ఆశ్చర్యపోయారు. ఇంత బాగా ఆడతావ్ అని అస్సలు ఊహించలేదు.. వెంటనే నాన్నకు ఫోన్ చెయ్ అంటూ చెప్పాడు వాడిని చదవమని జాబ్ చేయమని బలవంతం చెయ్యకండి.. వాడికి తోడుగా నేను ఉంటాను అంటూ తల్లిదండ్రులకు హామీ ఇచ్చాడు. ఖర్చులన్నీ నేనే భరిస్తా అని చెప్పి 500 రూపాయలు చేతిలో పెట్టాడు. అదే నా తొలి సంపాదన.. ఇక 300 ఇంట్లో నుంచి 200 నా దెగ్గర పెట్టుకున్నా.. క్రికెట్ వైపు రావడానికి పరోక్షంగా మామయ్య కారణం.. ప్రత్యక్షంగా అప్పుడు తీసిన 9 వికెట్లు కారణం.. తొమ్మిది వికెట్ల తలరాతను మార్చేసాయి అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి