కానీ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన వెస్ట్ ఇండీస్ అదరగొడుతోంది. వరుస మ్యాచ్ లలో తనకంటే బలమైన జట్లు న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ లను ఉత్కంఠ పోరులో ఓడించి విజయాలను సాధించింది. రేపు ఉదయం వెస్ట్ ఇండీస్ భారత ను ఢీకొనబోతోంది. అయితే ప్రస్తుతం ఉన్న ఫామ్ ప్రకారం చూస్తే ఇండియా కన్నా వెస్ట్ ఇండీస్ ఈ మ్యాచ్ లో ఫేవరెట్ అని చెప్పాలి. ఆడిన రెండు మ్యాచ్ లలోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో మూడవ మ్యాచ్ లో బరిలోకి దిగనుంది. ఇక ఇండియా విషయానికి వస్తే మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ ను ఓడించినా రెండవ మ్యాచ్ లో కివీస్ చేతిలో ఓటమి పాలయింది.
వెస్ట్ ఇండీస్ జట్టు పరంగా చూస్తే డాటిన్, మాథ్యూస్, క్యాంపు బెల్ మరియు నేషన్ లు బ్యాటింగ్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు. వీరు కనుక మరోసారి రాణిస్తే భారత్ కు ఓటమి తప్పదు. అయితే భారత్ కూడా తన సహజమైన ఆటను ఆడితేనే విజయం దక్కుతుంది. టెస్ట్ మ్యాచ్ లాగా ఆడితే గెలవడం కష్టమే. రేపు మ్యాచ్ లో అయినా జట్టులోకి షెఫాలీ వర్మను తీసుకోవాలి. తనపై ఒత్తిడి పెట్టకుండా తన ఆటను ఆడనిస్తే ఫలితం ఉంటుంది. మరి చూద్దాం వరుస విజయాలతో జోరుమీదున్న వెస్ట్ ఇండీస్ కు మిథాలీ సేన బ్రేక్ లు వేస్తుందా?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి