మహిళల ప్రపంచ కప్ లో భాగంగా ఈ రోజు జరిగిన 10 వ మ్యాచ్ హామిల్టన్ వేదికగా ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్య జరిగింది. కాసేపటి క్రితమే ముగిసిన ఈ మ్యాచ్ లో ఇండియా తన ప్రత్యర్థి విండీస్ ను 152 పరుగుల భారీ తేడాతో ఓడించి ఒక్క రోజు ముందు న్యూజిలాండ్ తో ఎదురైన పరాభవానికి ఘాటైన సమాధానం ఇచ్చింది. దీనితో ఇండియా ఆడిన 3 మ్యాచ్ లలో రెండు గెలిచి పాయింట్ల పటికలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా చేసిన ప్రదర్శన ఒక్కసారిగా టైటిల్ ఫేవరేట్ లలో ఒకటిగా నిలిపింది అని చెప్పాలి. అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఇండియా ఆటగాళ్ళు అదరగొట్టారు.

వరుస విజయాలతో సెమీస్ బెర్త్ ను దక్కించుకోవడానికి దూసుకెళ్తున్న విండీస్ కు అడ్డుకట్ట వేసింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్  చేసిన ఇండియా మహిళలు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. బదులుగా 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఓపెనర్లు డాటిన్ మరియు మాథ్యూస్ లు ఇండియా బౌలర్ లను చీల్చి చెండాడారు. ఒక దశలో కేవలం 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. అయితే వీరిద్దరి జోరుకు బ్రేక్ లు వేసింది స్నేహ రాణా... జోరుమీదున్న డాటిన్ ను మొదట ఔట్ చేసి ఇండియా శిబిరంలో ఉత్సాహాన్ని నింపింది.

ఇక ఆ తర్వాత ఏ దశలోనూ విండీస్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించలేదు. అలా కేవలం 40.3 ఓవర్లలో 162 పరుగులకు చాప చుట్టేసింది. దీనితో ఇండియా 155 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా కన్నా మెరుగైన రన్ రేట్ ను సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఆటతీరును కొనసాగిస్తే లాస్ట్ టైం  మిస్ అయిన్ వరల్డ్ కప్ ఈ సారి దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: