న్యూజిలాండ్ వేదికగా గత రెండు వారాల నుండి జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. ఈ టోర్నీ నాక్ ఔట్ దశకు చేరుకోవడానికి 8 జట్లు తమ పోరాటాన్ని సాగిస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఒక్కో జట్టు మిగిలిన జట్లతో మొత్తం 7 మ్యాచ్ లు ఆడనుంది. ఈ మ్యాచ్ లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి నాలుగు జట్లు సెమీఫైనల్ కు అర్హత సాదిస్తాయి. అయితే ఇప్పటికీ ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా లు ఇప్పటికే వరుసగా 4 మ్యాచ్ లు గెలిచి సెమీస్ కు దగ్గరగా ఉన్నాయి. ఇక మిగిలిన రెండు బెర్త్ ల కోసం నాలుగు జట్ల మధ్యన పోటీ ఉండే అవకాశం ఉంది.

ఈ అవకాశం ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మరియు వెస్ట్ ఇండీస్ లకు ఉంది. కాగా నేడు కీలకమైన మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా తో తలపడింది. ఈ మ్యాచ్ లో గెలవడం ఇండియాకు చాలా అవసరం. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లు గెలిచి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీనితో ఈ మ్యాచ్ ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అందులో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియాకు శుభారంభం దక్కలేదు.  ఫామ్ లో ఉన్న స్మృతి విఫలం అయింది. అలాగే మళ్లీ అవకాశం దక్కిన షేఫాలి వర్మ మరో సారి ఇండియా యాజమాన్యాన్ని నిరాశ పరిచింది.

అయితే ఆ తర్వాత వికెట్ పడకుండా కెప్టెన్ మిథాలీ (68) మరియు యస్తిక భాటియా (59) లు అర్ధ సెంచరీలతో రాణించడంతో ఇండియా నిలబడగల్గింది. ఇక చివర్లో ఎప్పటిలాగే హర్మన్ ప్రీత్ కౌర్ వేగంగా ఆడి జట్టు స్కోర్ ను ౨౭౭ పరుగులకు చేర్చింది. ఈ క్రమంలో పూజ వస్త్రాకర్ విలువైన పరుగు చేసి ఇండియా కు గౌరవప్రదమైన స్కోర్ చేయడంలో సహాయపడింది. ఆస్ట్రేలియా ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఈ స్కోర్ ను సునాయాసంగా చేధించగలదు. ఇండియా కంగారూలను తన బౌలింగ్ తో కట్టడి చేస్తుందా అన్నది తెలియాలంటే కాసేపు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: