గత కొంతకాలం నుంచి అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్న కె.ఎల్.రాహుల్ నిన్నటి వరకు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఇటీవలే మెగా వేలంకి ముందు తప్పుకున్న కేఎల్ రాహుల్ ను ఐపీఎల్లో కి కొత్త గా ఎంట్రీ ఇస్తున్న లక్నో జట్టు రిటైన్ చేసుకోవడమే కాదు సారథ్య బాధ్యతలను కూడా అప్పగించింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి లక్నో కెప్టెన్ గా మారిపోయిన కేఎల్ రాహుల్ కొత్త ఆటగాళ్లతో జట్టును ఎలా నడిపించ పోతున్నాడో అన్నది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన మొదటి మ్యాచ్లో లక్నో కెప్టెన్ కె.ఎల్.రాహుల్ నిరాశపరిచాడు.


 ఏకంగా ప్రత్యర్థి గుజరాత్ టైటాన్స్ ముందు లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అయితే లక్నో తొలి మ్యాచ్లోనే ఓటమి పాలు కావటం పై కొంతమంది అభిమానులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. కేఎల్ రాహుల్ తమ జట్టు స్టార్ బౌలర్ షమీ నాలుగు ఓవర్లు కోటాను పూర్తి చేయకపోవడం పై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఆకాష్ చొప్రా. ఒకవేళ దుష్మంత చమీరా తో  నాలుగు ఓవర్లు వేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దుష్మంత చమీరా ఒక అత్యుత్తమ బౌలర్ అంటూ ఆకాష్ చొప్రా వ్యాఖ్యానించాడు.


 అంతేకాకుండా ఆలస్యంగా కాకుండా కె.ఎల్.రాహుల్ దుష్మంత చమీరాను కాస్త ముందుగానే బౌలింగ్ తీసుకువచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే దుష్మంత చమీరా తన ఫేస్ బౌలింగ్తో రెండు వికెట్లు పడగొట్టి మంచి శుభారంభం ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇక  టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన అతిపెద్ద తప్పిదం అదే అంటూ వ్యాఖ్యానించాడు. దుష్మంత చమీరా నాలుగు ఓవర్లు కోటాను పూర్తి చేసి ఉంటే అతడు మరిన్ని వికెట్లు తీసేందుకు అవకాశం ఉండేదని ఆ వికెట్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసి అంటూ వ్యాఖ్యానించారు ఆకాశ్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl