అదే సమయంలో అటు ఐపీఎల్ లో ఆడుతున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు ఎలాంటి ప్రదర్శన చేస్తున్నారు అన్న విషయంపై కూడా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాడు రవిశాస్త్రి. ఈ క్రమంలోనే ఇటీవల యువ ఆటగాడు శుభ్ మాన్ గిల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా ప్రస్తుతం ఐపీఎల్ లో భాగంగా శుభ్ మాన్ గిల్ గుజరాత్ టైటన్స్ జట్టుకి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ లో భాగంగా లక్నో తో జరిగిన తొలి మ్యాచ్లో డకౌట్ అయినా శుభ్ మాన్ గిల్ ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో మాత్రం గొప్పగా పుంజుకున్నాడు 84 పరుగులతో రాణించాడు.
ఈ క్రమంలోనే గిల్ ప్రతిభ పై స్పందించిన రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతనిలో గొప్ప నైపుణ్యం ఉంది. ప్రస్తుతం ప్రపంచ స్థాయికి క్రికెటర్లలో అతను అత్యుత్తమ ఆటగాడు. ఒక్కసారి క్రీజ్లో కుదురుకున్నాడంటే చాలు ఎంతో సులభంగా పరుగులు రాబట్టగల సామర్థ్యం అతని సొంతం. అంతే కాదు అతని షాట్ సెలక్షన్ స్ట్రైక్ రోటేట్ చేసే విధానం కూడా ఎంతో బాగుంది. ఇక ఇటీవల ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో కేవలం ఆరు బంతులు మాత్రమే డాట్ చేశాడు. ఇక మంచి బంతులను సమర్థవంతంగా బౌండరీకి తరలించాడు. అతను ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు అంటు రవి శాస్త్రి ప్రశంసలు కురిపించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి