ప్రస్తుతం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు కుల్దీప్ యాదవ్. తన లెగ్ స్పిన్ తో అదరగొడుతున్నాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే కోల్కతాలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర వహించి ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చేరిపోయాడు. ఉమేష్ యాదవ్ తో కలిసి తొలిస్థానంలో కొనసాగుతూ ఉన్నాడు. కేవలం వికెట్లు తీయడమే కాదండోయ్ ఇక మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగ్ తో కూడా అదరగొడుతున్నాడు.
ఇటీవల జరిగిన మ్యాచ్ లో స్టనింగ్ క్యాచ్ తో అదరగొట్టాడు కుల్దీప్ యాదవ్. ఇన్నింగ్స్ 16 ఓవర్ లో భాగంగా ఐదో బంతిని ఉమేష్ యాదవ్ స్వీప్ షాట్ ఆడగా.. ఈ క్రమంలోనే బంతి గాల్లోకి లేచింది. దాదాపు 30 గజాల దూరం పరుగెత్తిన కుల్దీప్ యాదవ్ ముందులు డైవ్ చేస్తూ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అదే ఓవర్ లో కమిన్స్, నరైన్ లను అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో మూడు వికెట్లు పడగొట్టి కోల్కతాకు పతనాన్ని చవి చూపించాడు. ఇలా ఒకప్పుడు వరుస ఫెయిల్యూర్ తో టీమిండియా జట్టులో చోటు కోల్పోయిన కుల్దీప్ యాదవ్ ఇప్పుడు మాత్రం సత్తా చాటుతున్నారు. అతని పర్ఫార్మెన్స్ చూసిన అభిమానులు మీరు మారిపోయారు సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి