
ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రమాదానికి గురైన కొన్ని ఘటనల్లో ఏకంగా వాహనదారులు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉండడం చూసి అందరూ ఆందోళన చెందుతున్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలి అనే ఆలోచనను విరమించుకున్నారు చాలామంది. అయితే మరి కొంతమంది అసలు ఇలా ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలి పోవడానికి గల కారణాలు ఏంటి అన్న విషయంపై వెతకడం ప్రారంభించారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ పేలుడుకు కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎలక్ట్రికల్ వెహికల్స్ లోని లిథియం అయాన్ బ్యాటరీ లో దాదాపు 100 నుంచి 200 వరకు సెల్స్ ఉంటాయి. వాటి ప్యాకింగ్ విధానంలో తేడా ఉంటే ఇక పేలిపోయే ఛాన్స్ ఉంటుందట.
ఇక బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం కూడా పేలుడుకు కారణం అని అంటున్నారు నిపుణులు.
వైరింగ్ తప్పిదాలు ఫ్యూయల్ లైన్ లో తేడాలు కూడా ఈ పేలుడు కి కారణాలట.
అంతేకాకుండా సమయానికి మించి ఛార్జింగ్ పెట్టడం కూడా పేలుడుకు కారణం అని అంటున్నారు.
వాహనాన్ని కడిగిన వెంటనే ఛార్జింగ్ పెడితే అందులో సాకెట్లు దెబ్బతింటుందని ఇది కూడా ఒక కారణం అవుతుందని చెబుతున్నారు.
ఇక విద్యుత్ లో హెచ్చుతగ్గులు కూడా బ్యాటరీ వేడెక్కడానికి కారణం అవుతుందట. తద్వారా పేలుడు సంభవిస్తుందట..